- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాటీలివర్ రిస్క్‌ను తగ్గిస్తున్న ద్రాక్ష.. అందులోని సమ్మేళనాలే కారణం!
ద్రాక్ష తినడంవల్ల ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గడానికి ప్రధాన కారణం ఈ పండ్లల్లో ఉండే శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు అంటున్నారు పోషకాహార నిపుణులు.

దిశ, ఫీచర్స్ : శరీరంలో అధిక కొవ్వుతో, ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అట్లయితే డైలీ రెండు కప్పుల ద్రాక్షపండ్లను తినండి! కొంతకాలానికి మీ సమస్య తీరిపోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఫుడ్ జర్నల్‌లో పబ్లిషైన ఒక పరిశోధన కూడా ఇదే చెబుతోంది. ద్రాక్ష తినడంవల్ల అధిక కొవ్వు కలిగిన ఆహారాలను తినడంవల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను అవి కొంత వరకు తగ్గించి, నాన్ - ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రమాదాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నది.
ద్రాక్ష తినడంవల్ల ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గడానికి ప్రధాన కారణం ఈ పండ్లల్లో ఉండే శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి జన్యువుల బిహేవియర్‌ను ప్రభావితం చేస్తాయి. శాస్త్రవేత్తలు 5% స్టాండర్డైజ్డ్ గ్రేప్ పౌడర్‌తో అధిక కొవ్వు ఆహారం ఇచ్చిన ఎలుకలపై 13 వారాల పాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా ద్రాక్ష పండ్లను లేదా పండ్ల రసాన్ని ఎలుకలకు ఇవ్వడంవల్ల కొంత కాలానికి వాటి శరీరంలోని కొవ్వు నిల్వలు, కొలెస్ట్రాల్ ఉత్పత్తిలో పాల్గొనే జన్యువులు తగ్గాయి. అంతేకాకుండా అవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కొనే, అలాగే డిటాక్సిఫికేషన్‌కు సహాయపడే జన్యువులు పెరిగాయి. ఇది మానవులకు కూడా వర్తిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా అధిక కొవ్వు కలిగిన ఆహారాలు తినడంవల్ల కాలేయం ఒత్తిడికి గురైనప్పుడు, ద్రాక్షలోని సమ్మేళనాలు ఆ భారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి. అలాగనీ కేవలం ద్రాక్ష పండ్లు తినడమే అధిక కొవ్వు తగ్గడానికి ప్రధాన ప్రత్యామ్నాయం మాత్రం కాదు. కొవ్వును తగ్గించే ఆహారంలో ద్రాక్ష పండ్లను ఒక భాగంగా మాత్రమే చూడాలంటున్నారు నిపుణులు. దీంతోపాటు సమతుల ఆహారం, రెగ్యులరఱ్ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం. లింక్
Read More : చలికాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు.. ఇలాంటి వారిలోనే అధికం
చలికాలంలో షుగర్ ఎందుకు పెరుగుతుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?






