చలికాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు.. ఇలాంటి వారిలోనే అధికం!

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-26 06:35:03  IST  )

దేశవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది.

చలికాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు..  ఇలాంటి వారిలోనే అధికం!
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉదయం పొగమంచు కప్పబడి ఉంటుంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం 5 దాటితే చాలు చలి వణికించేస్తోంది. వాతావరణంలో వచ్చే మార్పులు వ్యక్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇక, ప్రస్తుతం శీతాకాలం కావడంతో అందులోనూ రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోవడం మరియు పొడి వాతావరణం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

చలికాలంలో ప్రధానంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో శ్వాసకోశ సమస్యలు ఒకటి. జలుబు, ఫ్లూ, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు చలి, పొడి గాలి వల్ల పెరుగుతాయి. అంతేకాదు, చర్మం పొడిబారడం, పగలడం, దురద, పెదవుల పగుళ్లు మరియు పాదాల పగుళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల కీళ్లవాతం (Arthritis) ఉన్నవారిలో కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయట. చలికి రక్తనాళాలు సంకోచించడం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల కొందరిలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) లేదా డిప్రెషన్ రావచ్చు. అందువల్ల చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అవి ఏంటంటే.. బయటకు వెళ్ళేటప్పుడు తగినంత వెచ్చని దుస్తులు ధరించాలి. రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారం, వేడి పదార్థాలు తీసుకోవాలి. దాహం వేయకపోయినా తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవికరించలేదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More..

చలికాలంలో షుగర్ ఎందుకు పెరుగుతుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?

Next Story