- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Liver Health : మీలో కాలేయాన్ని దెబ్బతీసే కొన్ని రోజువారీ అలవాట్లు.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే డేంజర్లో పడ్టట్టే..!
కొందరు ప్రతీ చిన్న సమస్యకు మెడిసిన్ వాడుతుంటారు. కానీ ఇది అలవాటుగా మారితే మీ కాలేయాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇది జీర్ణక్రియ, బాడీ డిటాక్సిఫికేషన్, అలాగే శరీరంలో ఎనర్జీ నిర్వహణలో కీ రోల్ పోషిస్తుంది. అయితే ఇటీవల కొన్ని రోజువారీ అలవాట్లు కాలేయాన్ని ప్రమాదంలో పడేస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన లక్షణాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కాలేయాన్ని దెబ్బతీసే అలవాట్లు
* అధిక మద్యపానం : మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. అయితే అధిక మద్యపానం మీ కాలేయాన్ని అత్యంత త్వరగా రిస్క్‌లో పడేస్తుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. తద్వారా ఫ్యాలీ లివర్, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి.
*అన్‌హెల్తీ ఫుడ్స్ : అధిక కొవ్వు, అధిక చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోవడం వల్ల నాన్ - ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వస్తుంది.
*మెడిసిన్ దుర్వినియోగం : కొందరు ప్రతీ చిన్న సమస్యకు మెడిసిన్ వాడుతుంటారు. తలనొప్పి రాకున్నా వస్తుందేమో అనే అనుమానంతో ముందుగానే ట్యాబ్లెట్ వేసుకుంటారు. కానీ ఇది అలవాటుగా మారితే మీ కాలేయాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డాక్టర్ సలహాల లేకుండా పెయిన్‌కిల్లర్స్ (పారాసెటమాల్ వంటివి) లేదా ఇతర ఏ విధమై ఔషధాలను కూడా అధికంగా వాడకూడదు. వాడితే కాలయం దెబ్బతింటుంది.
*ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం : దీర్ఘకాలంపాటు శారీరక శ్రమకు దూరంగా ఉంటే ఊబకాయం, అధిక బరువుతో పాటు ఫ్యాటీ లివర్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్‌లో ఉండే ఫ్రక్టోజ్ వంటివి కాలేయంలో కొవ్వును పెంచుతాయి.
*ధూమపానం : ధూమపానం కాలేయంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. దీర్ఘకాలంపాటు సరైన విశ్రాంతి లేకపోవడం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
లివర్ డేంజర్‌లో ఉందని సూచించే లక్షణాలు
* తీవ్రమైన అలసట : తరచుగా అధిక అలసట, శారీరక బలహీనత
*కామెర్లు (Jaundice): చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం (బిలిరుబిన్ పెరగడం వల్ల ఇలా జరుగుతంది).
*కడుపు నొప్పి: కుడి పక్కటెముక కింద భాగంలో తరచుగా నొప్పి లేదా అసౌకర్యం
* జీర్ణ సమస్యలు: వికారం, వాంతులు, ఆకలి తగ్గడం, లేదా జీర్ణక్రియ సమస్యలు అధికం కావడం
*మూత్రం, మలం రంగులో మార్పు: మూత్రం గాఢమైన పసుపు రంగులో, మలం లేత రంగులో ఉండటం.
*వాపు : కాళ్లు చీలమండలు, లేదా కడుపులో వాపు (Ascites)
*చర్మ సమస్యలు: చర్మంపై దురద, గీతలు లేదా స్పైడర్ వంటి రక్తనాళాలు కనిపించడం.
*అసాధారణ బరువు : ఊహించని విధంగా బరువు తగ్గడం లేదా పెరగడం.
*మానసిక గందరగోళం : తీవ్రమైన సందర్భాల్లో, హెపటిక్ ఎన్సెఫలోపతి వల్ల గందరగోళం లేదా జ్ఞాపకశక్తి సమస్యలు తలెల్తుతాయి.
పరిష్కారం ఏమిటి?
* కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ (మాంసం, చేపలు, గింజలు) వంటివి తీసుకోవాలి
*చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తగ్గించాలి
* గ్రీన్ టీ, బీట్‌రూట్, పసుపు, వెల్లుల్లి వంటివి కాలేయ ఆరోగ్యానికి మంచివి.
* ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడం లేదా చాలా తక్కువగా తీసుకోవడం చేయాలి
* రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా, లేదా ఇతర వ్యాయామాలు ఏవైనా చేయడం ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తాయి.
*డాక్టర్ సలహాలు లేకుండా ప్రతీ చిన్న సమస్యకు సొంతంగా ఔషధాలు వాడకూడదు. అలాగే అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. రెగ్యులర్ హెల్త్ చెకప్‌ల ద్వారా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా వివిధ హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Kidney Stones Causes : కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఏర్పడుతాయి?






