Kidney Stones Causes : కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఏర్పడుతాయి?

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-20 05:58:48  IST  )

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ నొప్పి భరించలేక గిల గిల కొట్టుకుంటారు. కానీ అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి? అనే సందేహం చాలా మందిలో ఉంటుండగా.. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వెల్లడించారు నిపుణులు

Kidney Stones Causes : కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఏర్పడుతాయి?
X

దిశ, వెబ్ డెస్క్: మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ నొప్పి భరించలేక గిల గిల కొట్టుకుంటారు. కానీ అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి? అనే సందేహం చాలా మందిలో ఉంటుండగా.. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వెల్లడించారు నిపుణులు. మూత్రంలోని కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్, సిస్టీన్ వంటి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు.. వాటిని బయటకు పంపలేనప్పుడు కిడ్నీ స్టోన్స్ వస్తాయని తెలిపారు నిపుణులు.

* బాడీకి సరిపోయేంత నీటిని తాగకపోయినప్పుడు.. రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.

* అధిక ఉప్పు, చక్కెర తీసుకోవడం కూడా ప్రమాదమే. కాగా ఆక్సలేట్ అధికంగా ఉండే టీ, చాక్లెట్స్, పాలకూర అధికంగా తీసుకోకూడదు. మాంసం, చేపలు కూడా మూత్రపిండాల్లో రాళ్లకు కారణం.

* ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే.. తర్వాతి తరంలోనూ రాళ్లు ఏర్పడే చాన్స్ ఎక్కువ.

* హైపర్ పారా థైరాయిడిజం, మూత్రనాళాల ఇన్ఫెక్సన్లు, యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటడం, జీర్ణాశయ రుగ్మతలు ఇందుకు మరో కారణం.

* అధిక బరువు, ఎక్సర్‌‌సైజ్ చేయకపోవడం కూడా కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని పెంచుతాయి.

Next Story