- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్ఞాపక శక్తిని పెంచుతున్న సామాజిక సంబంధాలు.. వృద్ధాప్యంలోనూ చెక్కు చెదరకుండా..!
‘అల్జీమర్స్ & డిమెన్షియా’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. 80 ఏళ్ల వయస్సులో కూడా 20-30 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల జ్ఞాపకశక్తిని కలిగి ఉన్న కొందరు వ్యక్తుల రహస్యాన్ని పరిశోధకులు వెలికితీశారు.

దిశ, ఫీచర్స్ : సామాజిక సంబంధాలు వృద్ధాప్య లక్షణాల నివారణలో కీ రోల్ పోషిస్తాయని, ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహద పడతాయని ‘అల్జీమర్స్ & డిమెన్షియా’ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సూపర్ ఏజింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా, దశాబ్దాల పాటు 80 ఏండ్ల వయసులో కూడా 20 నుంచి 30 ఏండ్ల వయస్సుగల వ్యక్తుల మాదిరి స్థిరమైన జ్ఞాపక శక్తి కలిగి ఉన్న కొందరు వ్యక్తుల రహస్యాన్ని వెలికి తీసింది.
‘అల్జీమర్స్ & డిమెన్షియా’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. 80 ఏళ్ల వయస్సులో కూడా 20-30 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల జ్ఞాపకశక్తిని కలిగి ఉన్న కొందరు వ్యక్తుల రహస్యాన్ని పరిశోధకులు వెలికితీశారు. ‘నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ సూపర్‌ఏజింగ్ ప్రోగ్రామ్’లో భాగంగా, దశాబ్దాల పాటు పలువురు పార్టిసిపెంట్స్ (participants)ను అనుసరించి, జ్ఞాన సామర్థ్యం (Cognitive ability), బ్రెయిన్ స్ట్రక్చర్, పాథాలజీ, జీవన శైలి లక్షణాలను అధ్యయనంలో భాగంగా పరిశీలించి వెల్లడించగా ఇటీవల ఇది పబ్లిషైంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆరోగ్యం (Medical health), వ్యాయామం, లేదా ఆహారపు అలవాట్లు ఈ ‘సూపర్ ఏజర్స్’ను సాధారణ వ్యక్తుల నుంచి స్థిరంగా వేరు చేయలేదు. అయితే వీరి మెదడు నిర్మాణం, అలాగే వ్యక్తిత్వ లక్షణాలు ప్రత్యేకంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా సూపర్ ఏజర్స్‌లో అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (anterior cingulate cortex) అనే మెదడు ప్రాంతంలో మందమైన కణజాలం కనిపించింది. ఈ ప్రాంతం ప్రేరణ (motivation), సామాజిక బంధాలకు (social bonding) సంబంధించినది. అంతేకాదు, సదరు వృద్ధుల మెదడులో వాన్ ఎకనామో న్యూరాన్లు (von Economo neurons) అధిక సాంద్రతలో ఉన్నాయి. ఈ ప్రత్యేక న్యూరాన్లు సానుభూతి (empathy), సామాజిక అవగాహన (social awareness)తో ముడిపడి ఉంటాయి.
సాధారణ జ్ఞాపకశక్తి గల వారితో పోలిస్తే, ఈ ‘సూపర్ ఏజర్స్’ ఎక్కువ సామాజికంగా ఉండే వ్యక్తులు(more social people)గా, చురుకుగా ఉండే వారి(more active people)గా, తమ సంబంధాల గురించి సానుకూల దృక్పథం కలిగిన వారిగా ఉన్నారని అధ్యయనంలో తేలింది. అంటే.. సామాజిక సంబంధాలు కేవలం భావోద్వేగ రక్షణ కవచం(An emotional shield)మాత్రమే కాకుండా, మెదడును వృద్ధాప్యం నుండి కాపాడే జీవశాస్త్రపరమైన రక్షణ కవచంగానూ పనిచేస్తాయని ఈ అధ్యయనం సూచిస్తున్నది. సామాజికంగా కనెక్ట్ అయి ఉండటం జ్ఞాపకశక్తిని వృద్ధాప్యంలో కూడా సంరక్షించే మెదడు నిర్మాణాలను నిలబెట్టడంలో సహాయపడుతుంది.






