- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవ శరీరంలో ‘రెండవ గుండె’! దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
పరిశోధనల ప్రకారం ఈ ‘మస్కులర్ పంప్’ విధానం రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే దీర్ఘకాలంపాటు తరచుగా స్థిరంగా కూర్చునే లేదా నిలబడే అలవాట్లు, సరైన భంగిమలో నిలబడకపోవడం లేదా కూర్చోకపోవడం వంటి కారణాలవల్ల ఈ సెకండ్ హార్ట్ దెబ్బతింటుంది.

దిశ, ఫీచర్స్ : శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె కూడా ఒకటనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘రెండవ గుండె’ కూడా ఉంటుందని మీకు తెలుసా? అంటే ఇది నిజమైన హార్ట్ కాదు కానీ.. అంతటి ప్రాధాన్యత కలిగిన ఉన్నందున ఆ విధంగా పిలుస్తారు. అవే కాళ్లకు వెనుక భాగంలో ఉండే పిక్క కండరాలు (Calf Muscles). ఇవి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. అందుకే సెకండ్ హార్ట్ అంటారు. ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తంది. కాళ్లల్లో ఉబ్బు లేదా వాపు, అలసట, వెరికోస్ వీన్స్ వంటి సమస్యలను నివారిస్తుంది.
పరిశోధనల ప్రకారం ఈ ‘మస్కులర్ పంప్’ విధానం రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే దీర్ఘకాలంపాటు తరచుగా స్థిరంగా కూర్చునే లేదా నిలబడే అలవాట్లు, సరైన భంగిమలో నిలబడకపోవడం లేదా కూర్చోకపోవడం వంటి కారణాలవల్ల ఈ సెకండ్ హార్ట్ దెబ్బతింటుంది. అంటే పిక్క కండరాలు బలహీనమవుతాయి. కాబట్టి అలా జరగకూడదంటే.. తరచుగా కూర్చొని లేదా నిలబడి పనిచేసే అవసరం ఉన్నవారు ప్రతీ 40 నిమిషాలకు లేదా ఒక గంటకు ఒకసారి విరామం తీసుకొని కాసేపు వాకింగ్ చేయడం వల్ల సెకండ్ హార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు పిక్కల రైజెస్ (కాల్ఫ్ రైజెస్), అంకుల్ సర్కిల్స్ లేదా కూర్చుని హీల్ లిఫ్ట్స్ చేయడం వంటి వ్యాయామాలు కూడా మంచి ప్రయోజనం కలిగిస్తాయి. కంప్రెషన్ సాక్స్ సహాయపడినప్పటికీ, కదలికలే ఉత్తమమైన వ్యాయామంగా, ఔషధంగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కాళ్లలో ముఖ్యంగా పిక్క కండరాల్లో నిరంతర వాపు, నడకలో నొప్పి, చర్మంలో మార్పులు, తిమ్మిరి లేదా తరచుగా చల్లని అనుభూతి వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే ఇవి మీ సెకండ్ హార్ట్ బలహీనపడిందనడానికి సంకేతాలు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమనాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Related News : ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్.. ఎందుకు వస్తుంది..? ఏం చేయాలి?






