వెదురు మొలకల్లో అద్భుత పోషకాలు.. భవిష్యత్ సూపర్‌ఫుడ్ ఇదే కావచ్చు!

by Javid Pasha |   (  Updated:2026-02-06 08:15:13  IST  )

అద్భుతమైన పోషక విలువల కారణంగా వెదురు మొలకలు ప్రపంచ వ్యాప్తంగా తదుపరి సూపర్‌ఫుడ్‌గా మారవచ్చునని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వెదురు మొలకల్లో అద్భుత పోషకాలు.. భవిష్యత్ సూపర్‌ఫుడ్ ఇదే కావచ్చు!
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? అటవీ ప్రాంతాల్లో నివాసముండే ఆదివాసీలు ఉపయోగించే ఆహారాల్లో వెదురు మొలకలు లేదా రెమ్మలు కూడా ఒకటి. అందుకేనేమో పట్టణవాసులతో పోలిస్తే.. వాళ్లకు తగిన పోషకాహారం అందకపోయినా ఎటువంటి రోగాలు రావు. 80 ఏండ్ల వయసులో కూడా బీపీ, షుగర్లు వంటివి లేకుండా హ్యాపీగా బతికేస్తుంటారు. ఇందుకు గల కారణాల్లో బంబూ షూట్స్‌లోని పోషకాలు కూడా అంటుంటారు పలువురు నిపుణులు. యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ ఇదే తేలింది. వెదురు చెట్ల రెమ్మలు లేదా మొలకల్లో ఆరోగ్యానికి అవసరమైన అద్భుతమైన పోషకాలు ఉంటాయని, కాబట్టి ఇది భవిష్యత్ సూపర్‌ఫుడ్ ఆహారాల్లో భాగం అవుతుందని పేర్కొన్నది. ఆ వివరాలేమిటో చూద్దాం పదండి!

బాంబూ షూట్స్ (మొలకలు) ప్రపంచ వ్యాప్తంగా తదుపరి సూపర్‌ఫుడ్‌గా మారవచ్చునని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువగా ఆసియా దేశాల వంటకాల్లో ఉపయోగించే ఈ మొక్క భాగాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలు, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు, శరీరంలో మంట (inflammation)లను తగ్గించడం సాధ్యం అవుతుందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా వెదురు రెమ్మలను ఆహారంగా తినడ పేగు ఆరోగ్యాన్ని (gut health) మెరుగుపరుస్తుంది. వెదురు మొలకల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి చాలామంచిది.

శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ B కాంప్లెక్స్), పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలు అందడంవల్ల బరువు నియంత్రణ సులభం అవుతుంది. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం వంటి విషయాల్లో వెదురు మొలకలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే బాంబూ షూట్స్‌లో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్ (cyanogenic glycosides) అనే సహజ విషపదార్థాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని పచ్చిగా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. తప్పనిసరిగా సరిగ్గా వండి లేదా ఉడికించి మాత్రమే తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే బంబూ షూట్స్‌ని సూపర్ ఫుడ్‌గా సిఫార్సు చేయాలా వద్దా అనేది నిర్ణయించడానికి ముందు ఇంకా కొన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

ఎయిర్ పొల్యూషన్ డిటాక్స్.. ఈ ఫుడ్స్ తింటే మీ లంగ్స్ సేఫ్!

Next Story