ఎయిర్ పొల్యూషన్ డిటాక్స్.. ఈ ఫుడ్స్ తింటే మీ లంగ్స్ సేఫ్!

by Javid Pasha |

పాలకూర, బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఊపరితిత్తులను రక్షించడంలో సహాయపడతాయి.

ఎయిర్ పొల్యూషన్ డిటాక్స్.. ఈ ఫుడ్స్ తింటే మీ లంగ్స్ సేఫ్!
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల అనేక ఎదుర్కొంటున్న సమస్యల్లో లంగ్స్ ప్రాబ్లమ్ ఒకటి. దీనికి గల రకరకాల కారణాల్లో గాలి కాలుష్యం కూడా ఒకటి. ఇలాంటప్పుడు ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో బలమైన ఆహారాలు కూడా ఉన్నాయి అంటున్నారు నేచురోపతిక్ వైద్య నిపుణులు. అవేమిటో చూద్దాం పదండి!

*ఆకు కూరలు : పాలకూర, పాయల్ కూర, బచ్చలి కూర, కేల్(Kale) సహా పలు ఇతర ఆకు కూరలు తినడం లంగ్స్ హెల్త్‌కు మంచిది. ఎందుకంటే వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా కాలుష్యం వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో పోరాడతాయి. కాబట్టి ఆస్తమాతో ఇబ్బందిపడేవారు ఆకూకూరలను తప్పక తీసుకోవాలి.

*డ్రై ఫ్రూట్స్ : బాదం, వాల్ నట్స్, హెజెల్ నట్స్, పల్లీలు వంటి వాటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది సెల్ మెమ్బ్రేన్స్‌ను రక్షిస్తుంది. గాలి కాలుష్యం వల్ల ఆరోగ్యానికి కలిగే హానిని తగ్గిస్తుంది. రోజుకు ఒక చిన్న నాలుగైదు వాల్‌నట్స్ తిన్నా ఊపిరి తిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

*సుగంధ ద్రవ్యాలు : పసుపు, అల్లం వంటి మసాలా దినుసుల్లోనూ లంగ్స్ హెల్త్‌ను కాపాడే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పసుపులోని కర్క్యూమిన్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అల్లం కఫాన్ని తొలగిస్తుంది. కూరల్లో పసుపు, టీలో అల్లం వేసి తీసుకోవచ్చు.

*చేపలు : సాల్మన్, సార్డిన్స్, మాకరెల్ వంటి ఫ్యాటీ ఫిష్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి ఊపిరితిత్తుల ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. కాలుష్యం తర్వాత ఊపిరితిత్తుల ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*బెర్రీస్ : బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి వాటిలో విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ బలపరుస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో, సలాడ్‌లో లేదా స్నాక్‌గా తినవచ్చు. దీంతో ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. ఆస్తమా పేషెంట్లకు ఇంకా మంచిది. వీటితోపాటు ఆకు పచ్చని రంగులో ఉండే అన్ని రకాల కూరగాయలు, తాజా పండ్లు, లీన్ ప్రోటీన్స్ వంటివి ఊపిరితిత్తులను రక్షించడంలో సహాయపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story