30 ఏండ్లు దాటాక ఈ పని చేస్తే.. 50% తగ్గుతున్న ఆ రిస్క్..!

by Javid Pasha |   (  Updated:2025-08-22 11:14:59  IST  )

30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకోవడం జంటల్లో విడాకుల రేటును 50% తగ్గిస్తుందని పేర్కొన్నది.

30 ఏండ్లు దాటాక ఈ పని చేస్తే.. 50% తగ్గుతున్న ఆ రిస్క్..!
X

దిశ, ఫీచర్స్ : మీకింకా పెళ్లి కాలేదా..? మూడు పదులలోపు వయసులో ఉన్నారా? అయితే డోంట్ వర్రీ.. తొంద పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 ఏండ్లు దాటాక మాత్రమే ఈ పని చేస్తేవారిలో ఆ రిస్క్ 50% తగ్గుతుందని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? అనుకుంటున్నారా.. ? ‘విడాకులు’

జీవితంలో ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కూడా కొన్ని లాభాలున్నాయని పెద్దలు, నిపుణులు సహజంగానే చెబుతుంటారు. అయితే నేషనల్ సెంటర్ ఫర్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ రీసెర్చ్ (National Center for Family & Marriage Research) నుండి వచ్చిన ఓ పరిశోధన కూడా ఇదే వెల్లడించింది. 30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకోవడం జంటల్లో విడాకుల రేటును 50% తగ్గిస్తుందని పేర్కొన్నది. ఎందుకంటే.. ఈ వయసు దాటిన వ్యక్తులు పరిపక్వంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా బ్రెయిన్‌లో నియంత్రణ, నిర్ణయాలు తీసుకోవడానికి బాధ్యత వహించే భాగంగా పేర్కొనే ప్రీఫ్రంటల్ కార్టెక్స్- ఇంపల్స్ పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది.

అంతేకాకుండా మూడు పదులు దాటిన ఏజ్‌‌ గల వ్యక్తులు చాలా వరకు స్వీయ- అవగాహనతో, ఆర్థిక స్థిరత్వంతో ఉండే అవకాశం ఎక్కువ. అలాగే వీరు మెరుగైన సంఘర్షణ - పరిష్కార నైపుణ్యాల( conflict-resolution skills)తో నిబద్ధతలోకి ప్రవేశిస్తారు. ఇవి సంబంధాల్లో సంఘర్షణ నివారణకు దోహదం చేస్తుంటాయి. ప్రతీ విషయంలో అనవసర రాద్ధాంతంకంటే.. అర్థం చేసుకోవడానికి, వివాదాలను నివారించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంబంధాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందుకే బలమైన బంధం ఏర్పడుతుంది. ఇదే జంటల్లో విడాకుల రేటును తగ్గిస్తోంది.

ఒత్తిడితో తగ్గుతున్న శృంగార కోరికలు..! ఈ ఫుడ్స్ తింటే రేసు గుర్రాలే ఇక

Next Story