- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒత్తిడితో తగ్గుతున్న శృంగార కోరికలు..! ఈ ఫుడ్స్ తింటే రేసు గుర్రాలే ఇక !!
బాదం, వాల్‌నట్స్ వంటి గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, జింక్ ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ను పెంచడానికి సహాయపడతాయి.

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో శృంగారం కూడా ఒక ముఖ్యమైన భాగం. అయితే రోజువారీ జీవితంలో సెక్స్ కోరికలు ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి, తరచుగా ఒత్తిడికి గురికావడం వంటి పరిస్థితుల నడుమ, కొన్నిసార్లు అవి తగ్గుతూ.. పెరుగుతూ కూడా ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ కోరికలు తగ్గడానికి పోషకాహార లోపం కూడా కారణం కావచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అలాంటప్పుడు వాటిని భర్తీ చేసే ఆహారాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అవేమిటి? ఎలాంటి పోషకాలుంటాయి? ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం.
శృంగార కోరికలు (లిబిడో) పెంచే ఆహారాలలో కొన్ని పోషకాలు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, రక్త ప్రసరణ, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు, బాదం, వాల్‌నట్స్ వంటి గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, జింక్ ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ను పెంచడానికి సహాయపడతాయి. అలాగే జింక్ అధికంగా ఉండే ఆస్టర్స్(Oysters) కూడా పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ B6 ఉంటాయి. ఇవి హార్మోన్ సమతుల్యతను కాపాడతాయి. డార్క్ చాక్లెట్‌లో కూడా ఫినైల్‌ఎథైలమైన్, సెరోటోనిన్ ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరిచి శృంగార భావనలను ప్రేరేపిస్తాయని ఆరోగ్య, ఆహార నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా, ఒత్తిడిని తగ్గించడం ద్వారా లిబిడోను.. అంటే శృంగార కోరికల్ని పెంచుతాయి.
స్ట్రాబెర్రీలు, దానిమ్మ(Grenade) వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C ఉంటాయి. కాబట్టి వీటిని కూడా అప్పుడప్పుడూ తింటూ ఉంటే.. ఇవి రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫలితంగా లైంగిక పని తీరును మెరుగుపరుస్తాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరలలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. సాల్మన్ చేపలు, మాకెరెల్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి లైంగిక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలు శరీరంలో డోపమైన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు శృంగార కోరికలను పెంచడానికి దోహదపడతాయి.
*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






