- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త డేటింగ్ ట్రెండ్.. రివర్స్ క్యాట్‌ఫిషింగ్!
సాధారణంగా అవతలి వ్యక్తిని ఆకర్షించాలని తమ ఫొటోలను మరింత అందంగా ఎడిట్ చేసి, ఫిల్టర్ చేసి పెడుతుంటారు. కానీ ఈ కొత్త పోకడలో మాత్రం అందుకు భిన్నం.

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తితో శాశ్వత లేదా దీర్ఘకాలిక సంబంధంలోకి వెళ్లాలనుకున్నప్పుడు చాలామంది ఫాలో అవుతున్న ట్రెండే డేటింగ్. ఇక్కడ స్త్రీ, పురుషుడు ఒకరినొకరు తెలుసుకోవడం కోసం సమయం కేటాయిస్తారు. కలిసి తిరగడం, కలిసి డిన్నర్ చేయడం, కలిసి ప్రయాణించడం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఒక విధంగా ఇది ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమ లేదా పెళ్లివైపు వెళ్లే ప్రక్రియలో ఒక దశగానూ పేర్కొంటారు. ఆధునిక యువతలో రకరకాల డేటింగ్ పోకడలు కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో ‘రివర్స్ క్యాట్‌ఫిషింగ్’ కూడా ఒకటి. ఇంతకీ ఏమిటీ కొత్త ట్రెండ్? ఎందుకు ఫాలో అవుతున్నారు?
డేటింగ్ సైట్లలో లేదా యాపుల్లో ప్రొఫైల్ క్రియేట్ చేసేవారు సాధారణంగా అవతలి వ్యక్తిని ఆకర్షించాలని తమ ఫొటోలను మరింత అందంగా ఎడిట్ చేసి, ఫిల్టర్ చేసి పెడుతుంటారు. కానీ ఈ కొత్త పోకడలో మాత్రం అందుకు భిన్నం. ఎడిట్ చేసిన ఫొటోలు పెట్టకుండా తక్కువ ఆకర్షణీయమైన లేదా సాధారణ (low-effort) ఫొటోలను ఉద్దేశ పూర్వకంగా అప్‌లోడ్ చేస్తారు. దీని వెనుక అసలు ఉద్దేశం. ఆన్‌లైన్‌లో అవతలి వ్యక్తి గురించి ఏర్పడిన అంచనాలను తగ్గించి, వ్యక్తిగతంగా కలిసినప్పుడు వారు ఊహించినదానికంటే ఎక్కువ అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం ద్వారా మొదటి చూపులోనే బెస్ట్ ఓపీనియన్ కలిగించడం. ఈ ట్రెండ్ సాధారణ డేటింగ్‌పై ఉన్న అసంతృప్తి నుంచి ఉద్భవించిందని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ ప్రొఫైల్స్‌లో ఫిల్టర్లు, ఎడిట్ చేసిన ఫొటోల కారణంగా ఆఫ్‌లైన్‌లో కలిసినప్పుడు తరచుగా నిరాశ వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యకు అవకాశం లేకుండా రివర్స్ క్యాట్‌ఫిషింగ్ పనిచేస్తుందని దానిని సమర్థించేవారు పేర్కొంటున్నారు.
రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఒత్తిడి.. ఆ వ్యాధులకు ఇదే కారణమా?






