- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Success Story : అమ్మమ్మ ఐడియా..! ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న అక్కా చెల్లెళ్లు!!
రూ.5 లక్షలతో దొన్నె బిర్యానీ వ్యాపారం ప్రారంభించిన అక్కా చెల్లెళ్లు.. ప్రస్తుతం ఏడాదికి రూ. 10 కోట్లు సంపాదిస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : ‘‘ఒక దారి మూసుకుపోయిందని బాధపడుతూ కూర్చోకు.. గమ్యం చేరాలంటే.. లక్ష్యాన్ని ఛేదించాలంటే.. మరొక దారిలో పయనించు. అది కూడా మూసుకుపోతే.. అప్పుడు కూడా భయపడకు.. నువ్వే ఒక కొత్త దారిని క్రియేట్ చేసుకో.. అప్పుడందరూ నీ దారిలోకి వస్తారు లేదా నీ దారిలో నడిచే ప్రయత్నం చేస్తారు’’ అంటుంటారు నిపుణులు. ఇదొక కొటేషన్ కావచ్చు. కానీ ఆచరణలో పెడితే జీవితాలనే మార్చగలుగుతుందని మీకు తెలుసా? అందకు చక్కటి ఉదాహరణే రమ్య, శ్వేత రవి అనే ఇద్దరు సోదరీమణులు. ఒకప్పుడు కడుపేదరికాన్ని అనుభవించిన వీరు నేడు సంవత్సరానికి రూ. 10 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. వ్యాపార రంగంలో సక్సెస్ ఫుల్ ఉమెన్‌గా ఎంతోమంది యువతకు, మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
అమ్మమ్మ వంటకమే ప్రేరణ
రమ్య, శ్వేత, ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. బెంగుళూరు నివాసం. వాళ్ల నాన్న పేరు. ఆర్. రవిచందర్ దిగువ మధ్య తరగతి కుటుంబం. చిన్నపాటి హోటల్ నడుపుతూ జీవనం సాగించేవారు. ఆదాయం పెద్దగా రాకపోయేది. వచ్చిన మొత్తం కేవలం బతకడానికే సరిపోయేది. అయితేనేం రవించదర్ తన కూతుళ్లు పెద్దయ్యాక గొప్ప స్థాయిలో ఉండాలని ఊహించాడు. చిన్నప్పటి నుంచి వారికి వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కథలు చెప్పేవాడు. అది వారి మనసులో బాగా నాటుకుపోయిందేమో కానీ.. చదువులు పూర్తయ్యాక రమ్య, శ్వేత ఏదో ఒక ఉపాధిక్రియేట్ చేయాలనే లక్ష్యంవైపు అడుగేశారు. అప్పుడు వారి మదిలో ఒక సూపర్ ఐడియా మెదిలింది. ఏంటంటే.. అప్పుడప్పుడూ ఇంట్లో 60 ఏండ్ల వయసుగల తమ అమ్మమ్మ చేసే రుచికరమైన దొన్నె బిర్యానీ గుర్తుకు వచ్చింది. ఇంత రుచిని మనమే ఆస్వాదిస్తే ఎలా..? అందరికీ ఆ రుచిని పంచితే.. జీవనోపాధితో ఆదాయం లభిస్తుంది కదా అనుకున్నారు.
చిన్నగా మొదలై..
అది 2020 సంవత్సరం.. అమ్మమ్మ ఇచ్చిన దొన్నె బిర్యానీ రెసిపీతో చిన్న క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించారు. రమ్య, శ్వేత అనే ఇద్దరు సోదరీమణులు. కేవలం ₹5 లక్షల పెట్టుబడితో, 200 చదరపు అడుగుల స్థలంలో ఒకే ఒక కుక్, ఇద్దరు సహాయకులతో వ్యాపారం మొదలుపెట్టారు. అంతేకాదు RNR Donne Biryani అనే బ్రాండ్(తాత, నాన్న పేర్ల నుంచి)పేరుతో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా అమ్మడం మొదలుపెట్టారు. సక్సెస్ అవుతామో లేదోనని మొదట్లో కాస్త భయపడ్డారు. కానీ రోజులు గడిచేకొద్దీ వారిలో ఆత్మ విశ్వాసం పెరిగింది. ప్రజలను మెప్పించాలంటే తాము చిన్నపాటి హోటల్‌ను ఎలా నడపాలో అర్థం చేసుకున్నారు. ఎలాంటి షార్ట్‌కట్లు లేకుండా, శుభ్రత, నాణ్యత, రుచిలో స్థిరత్వం పాటించారు.
రూ. 10 కోట్ల టర్నోవర్
మంచి ప్యాకేజింగ్ (Tin boxes), హైజీన్ స్టాండర్డ్స్ పాటించడం, సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల రమ్య, శ్వేత మొదలు పెట్టిన దొన్నె బిర్యానీ రెసిపీ బిజినెస్ చాలా త్వరగా వృద్ధి చెందింది. రియల్ టైమ్ కస్టమర్లతోపాటు మొదటి నెలలోనే 10,000 ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీలో 2020లో బెస్ట్ బ్రాండ్‌గా ఎంపికయ్యారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ప్రస్తుతం బెంగళూరులో 14 క్లౌడ్ కిచెన్‌లు, ఒక డైన్-ఇన్ రెస్టారెంట్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు చిన్న బ్రాండ్‌తో మొదలైన వారి దొన్నె బిర్యానీ బిజినెస్ ఇప్పుడు ఏడాదికి రూ. 10 కోట్ల టర్నోవర్ బ్రాండ్‌గా మారింది. తండ్రి స్ఫూర్తితో, కుటుంబ సహకారంతో, అమ్మమ్మ చేతివంటకంతో వ్యాపారం ప్రారంభించి, స్వయం కృషి, పట్టుదల, అంకితభావం, ఆత్మ విశ్వాసంతో అడుగుముందుకు వేసిన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ల సక్సెస్ జర్నీ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శం.
Read More..






