- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రీడయాబెటిస్‌ను ఆహారం ద్వారా రివర్స్ చేయవచ్చా? నిపుణులు చెప్పేది ఇదే!
తినకూడదని తెలిసి కూడా తినే ఆహారాలవల్ల ఇటీవల ప్రీడయాబెటిస్ సమస్య పెరిగిపోతోంది. ఆహారంలో మార్పుల ద్వారా దీనిని నివారించవచ్చు.

దిశ, ఫీచర్స్ : ప్రీడయాబెటిస్ అంటే తెలిసిందే కదా.. వైద్య నిపుణుల ప్రకారం.. రక్తంలో చక్కెరస్థాయి సాధారణంకంటే ఎక్కువగా ఉండటాన్ని ఇలా పేర్కొంటారు. అంటే ఇంకా డయాబెటిస్ స్థాయికి చేరని దశ అన్నమాట. ఇది దాటగానే మధుమేహం దాడిచేస్తుంది. అయితే కొన్నిరకాల ముందుజాగ్రలతో దీనిని నివారించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆహారాన్ని మార్చడం ద్వారా ప్రీడయాబెటిస్‌ను రివర్స్ చేయవచ్చునని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం పదండి!
ప్రీడయాబెటిస్ అనేది డయాబెటిస్‌కు ముందు ఒక హెచ్చరికలాంటిది. ప్రస్తుతం చాలామందిని ఇది ప్రభావితం చేస్తున్నది. అయితే ఆహారాన్ని మార్చడం ద్వారా దీనిని రివర్స్ చేసే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. నిజానికి ఇది ప్రాసెస్డ్ సుగర్స్, రిఫైన్డ్ కార్బ్స్ (మైదా, స్వీట్స్, జ్యూస్, ఫాస్ట్ ఫుడ్) నిండిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడంవల్ల త్వరగా వస్తుంది. ఎందుకంటే ఇవి శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచి ఈ స్థితికి దారి తీస్తాయి. అంటే మీరు తినకూడదని తెలిసి కూడా తినే ఆహారాలవల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది! అయితే మీ ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా దీనినుంచి బయటపడవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్కువ ఫైబర్ ఉన్న కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ (Brown rice, multigrain), చికెన్, ఫిష్, దాల్ వంటి లీన్ ప్రోటీన్స్, అవకాడో, నట్స్ వంటి హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థితికి వచ్చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాల ప్రకారం.. 5-7% బరువు తగ్గడం ద్వారా చాలా మందిలో ప్రీడయాబెటిస్ పూర్తిగా రివర్స్ అయింది. ఎందుకంటే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్‌కు మారకుండా కాపాడుతుంది. అందుకోసం ప్రీడయాబెటిస్ బాధితులు చేయాల్సింది ఏమిటంటే.. ఆహారంలో భాగంగా ప్రాసెస్డ్ సుగర్స్‌ను తగ్గించాలి. బదులుగా ఫ్రెష్, న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవాలి. దీనికి తోడు రెగ్యులర్ వాకింగ్ లేదా వ్యాయామం మరింత మేలు చేస్తుంది. ఇది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చే ట్రాన్స్‌ఫార్మేషన్! అయితే ఏవిధమైన మార్పు చేసుకోవాలనుకున్నా ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
ప్రిడయాబెటిస్‌ను నివారించే ఆహారాలు :
*ధాన్యాలు & మిల్లెట్స్ : రాగి, జొన్న, సజ్జ, కోడి మిల్లెట్, బ్రౌన్ రైస్, ఓట్స్, మల్టిగ్రెయిన్ రోటీలు. వీటిని రోటీ, దోస, ఉప్మా, ఖిచిడి రూపంలో తినవచ్చు. అయితే వైట్ రైస్, మైదా మాత్రం తగ్గించాలి.
*కూరగాయలు : పాలకూర, మెంతికూర, బీట్‌రూట్ ఆకులు, బొప్పాయి, దొండకాయ, బీరకాయ, కాకరకాయ, క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, టమాటా. వీటిని ప్రతి రోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే ప్రీ-డయాబెటిస్‌ను స్టేజ్ నుంచి బయటపడవచ్చు.
*ప్రోటీన్ సోర్సెస్: పెసర పప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, రాజ్మా, శనిగలు, పన్నీర్, గుడ్లు, చికెన్/ఫిష్ (లీన్). ప్రతీ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు మెంతులను నీటిలో నానబెట్టి తాగడం లేదా ఆహారంలో వాడటం, చిన్న మొత్తంలో పసుపు, నువ్వులు, బాదం, వాల్‌నట్స్ వాడటం, ఉసిరి, జామా వంటివి రోజుకు ఒకటి తినడం కూడా ప్రీడయాబెటిస్‌ను రివర్స్ చేస్తుంది.
*ఎలా తినాలి? : ప్లేట్ మోడల్: సగం కూరగాయలు + నాలుగో వంతు ప్రోటీన్ + నాలుగో వంతు మిల్లెట్/రోటీ ఉండేలా చూసుకోండి. ఫ్రైడ్, స్వీట్స్, జ్యూస్, మైదా ఆహారాలు తగ్గించండి. రోజుకు 30-45 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే ఫలితాలు వేగంగా మెరుగవుతాయి.
*గమనిక : పైసమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను లేదా పోషకాహర నిపుణులను సంప్రదించగలరు.






