- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితం పరీక్ష పెట్టినా.. పరీక్షిత్ షా ఓడిపోలేదు.!
పట్టుదలతో ప్రయత్నించి డిజిటల్ ఎంట్రప్రెన్యూర్ అయి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు

దిశ, ఫీచర్స్: అన్నీ సక్రమంగా ఉండి.. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా కొందరు ఏదీ చేయరు. అలాంటివాళ్లు ఎవరైనా ఉంటే ముంబైకి చెందిన పరీక్షిత్ షాను చూసి మారండి. ఆయన కూర్చు్న్న చోటు నుంచి కదల్లేడు.. మెదల్లేడు. అయినా బాధపడకుండా పట్టుదలతో ప్రయత్నించి డిజిటల్ ఎంట్రప్రెన్యూర్ అయి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు.
దయనీయ పరిస్థితి..
పరిక్షిత్ షా ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన వ్యాధిగ్రస్తుడు. ఈ వ్యాధి వల్ల ఎముకలు చాలా పెళుసుగా మారి.. కదల్లేని పరిస్థితి. వాళ్లనాన్న ఉద్యోగం కోల్పోయి ఇంట్లోనే ఉండేవాడు. ఉపాధిలేక కుమిలిపోయి 2003లో చనిపోయాడు. తల్లి కూడా అనారోగ్యం బారినపడింది. కుటుంబాన్ని పోషించడానికి పైసా ఆదాయం లేదు. పరీక్షిత్ పరిస్థితి చూస్తేనేమో దయనీయంగా ఉంది. ఇక ఇలా అయితే కాదనుకొని చదువు మీద దృష్టి సారించాడు. వాస్తవానికైతే చదువుకోవడానికి అవకాశం లేని సిచువేషన్. మొత్తానికి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశాడు. పీహెచ్‌డీ ఎంట్రన్స్ క్లియర్‌చేసి బిజినెస్‌ను ఎంచుకున్నాడు.
ప్లూరాలిస్ డిజిటల్..
2013లో కాలేజీలో ఉండగానే కంటెంట్ స్ట్రాటజిస్ట్.. కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్ మొదలుపెట్టాడు. నెలకు రూ.10 వేల నుంచి రూ.45 వేల వరకు సంపాదించేవాడు. రాయడం సహజంగా అబ్బింది. తర్వాత అదే ఆర్థిక అవసరంగా మారింది. తన కంటెంట్ క్రియేషన్‌పై నమ్మకంతో 2018లో మొదటి డిజిటల్ ఏజెన్సీని పార్టనర్‌షిప్‌లో ప్రారంభించాడు. ఒక్క సంవత్సరానికే రూ.65 లక్షల ఆదాయం సాధించింది. 2024లో పార్టనర్‌షిప్‌ను వదిలేసి పాత క్లయింట్లు.. టీమ్ మీద నమ్మకంతో "ప్లూరాలిస్ డిజిటల్"ను స్టార్ట్ చేశాడు.
మౌత్‌టాక్‌తోనే..
"ప్లూరాలిస్ డిజిటల్".. ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్.. మీమ్ మార్కెటింగ్.. బ్రాండింగ్.. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ వంటి సేవలు అందిస్తుంది. జెనెరిక్ ప్యాకేజీలకు బదులు.. బ్రాండ్ అవసరాలకు తగ్గట్టు పర్సనలైజ్డ్ స్ట్రాటజీలు తయారు చేస్తారు. ప్రీమియం ఏఆర్ఎం నెలవారీ రిటైనర్ రూ.2.5 లక్షల నుంచి మొదలవుతుంది. యాన్యువల్ కాంట్రాక్టులు రూ.10-25 లక్షలు. 7 మంది రిమోట్ టీమ్‌తో పనిచేస్తూ హైబ్రిడ్ మోడల్‌కు మారనున్నారు. దీనికోసం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఇది పూర్తిగా మౌత్ టాక్ ద్వారా డెవలప్ అయిన స్టార్టప్.
ప్రపంచవ్యాప్తంగా..
ఇంటి నుంచే నడిచే ప్లూరాలిస్ డిజిటల్ ఏజెన్సీ ఇప్పుడు సంవత్సరానికి దాదాపు రూ.1 కోటి ఆదాయం సాధిస్తోంది. ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వంటి సేవలతో ఫైనాన్స్.. పాలిటిక్స్.. ఆటోమొబైల్స్.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో పెద్ద బ్రాండ్లకు భాగస్వామిగా మారింది. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. వాట్సాప్ మేనేజ్‌మెంట్.. ఈమెయిల్ మార్కెటింగ్.. ఆఫ్‌లైన్ ఇంటిగ్రేషన్ వంటి కొత్త సొల్యూషన్లను అభివృద్ధి చేస్తోంది. మార్కెటింగ్ అంటే కేవలం ప్రమోషన్ కాదు.. బ్రాండ్ అండ్ కస్టమర్ మధ్య కనెక్షన్ అని నిరూపిస్తోంది.
Read More..






