ప్రేమ స్పర్శ : బాల్యంలో హగ్స్‌తో ఆరోగ్యకరమైన ఎదుగుదల, ఆత్మ విశ్వాసం!

by Javid Pasha |   (  Updated:2026-01-06 07:51:37  IST  )

తల్లిదండ్రులు హగ్ పిల్లల్లో ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అభివృద్ధిలో, మెరుగైన భావోద్వేగ నియంత్రణలో కీ రోల్ పోషిస్తుంది.

ప్రేమ స్పర్శ : బాల్యంలో హగ్స్‌తో ఆరోగ్యకరమైన ఎదుగుదల, ఆత్మ విశ్వాసం!
X

దిశ, ఫీచర్స్ : ఆత్మీయుల మధ్య కౌగిలింతలు మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల కౌగిలింత వారి మెదడు ఎదుగుదలలోనూ కీ రోల్ పోషిస్తుందని, రోగ నిరోధక వ్యవస్థలను ఆకృతి చేసే జీవ సంబంధమైన భద్రతా సంకేతాలను అందిస్తుందని PubMed సహా జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. బాల్యంలో తరచుగా ప్రేమ పూర్వకమైన స్పర్శ లభించిన పిల్లలు ఆత్మ విశ్వాసం గలిగిన వారిగా, మెరుగైన రోగ నిరోధక శక్తి కలిగిన వారిగా ఎదుగుతారని పేర్కొన్నాయి. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం పదండి.

బాల్యంలో తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఇలా ప్రేమగల కుటుంబ సభ్యుల కౌగిలింత లేదా స్పర్శ చిన్న పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రేమతో హగ్ చేసుకోవడమనేది పిల్లల్లో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు, తక్కువ స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అభివృద్ధిలో, మెరుగైన భావోద్వేగ నియంత్రణలో కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే కౌగిలించుకున్నప్పుడు పిల్లల శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది స్ట్రెస్ రియాక్షన్‌ను శాంతపరుస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తాము చాలా సురక్షితంగా ఉన్నామనే భావనను పిల్లల్లో కలిగిస్తుంది. ఈ పరిస్థితి ఇమ్యూన్ సిస్టమ్ వేగంగా, సక్రమంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుంది. అందుకే తరచుగా అమ్మా నాన్నల సమక్షంలో, ప్రేమగల కుటుంబంలో పెరిగే పిల్లలు అత్యంత చురుగ్గా, యాక్టివ్‌గా, ధైర్యంగా, ఆత్మ విశ్వాసంగా ఉంటారు. ఏదైనా జబ్బుల బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటారు. ఇక్కడ అమ్మ లేదా నాన్న కౌగిలి పిల్లలకు మరింత ఎక్కువ ఓదార్పునిస్తుంది. పేరెంట్స్ ఆత్మీయ స్పర్శతో రియాక్ట్ అయిన నాడీ వ్యవస్థ, ‘మీరు అత్యంత సేఫ్‌ జోన్‌లో ఉన్నార’నే సంకేతాలను పిల్లల మెదడుకు పంపి, జబ్బుల నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. పిల్లల విషయంలోనే కాదు పెద్దల్లోనూ ప్రేమ పూర్వకమైన సంబంధాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. Link

Read More..

సాఫ్ట్ గర్ల్ ఎరా : జెన్ Z యువతులు ఈ ట్రెండ్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు?

Next Story