- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాఫ్ట్ గర్ల్ ఎరా : జెన్ Z యువతులు ఈ ట్రెండ్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు?
నాయకత్వ లేదా ఆధిపత్యం వహించే స్థాయిలో ఉండటం కంటే.. కంఫర్ట్ జోన్‌లో ఉండేందుకే చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.

దిశ, ఫీచర్స్ : సాఫ్ట్ గర్ల్ ఎరా(Soft Girl Era).. ఇటీవల తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పదమిది. చాలామంది మహిళలు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది మహిళల స్వీయ సంరక్షణ, వ్యక్తిగత సౌందర్యం, మానసిక సౌందర్యం, ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం విషయాలను చర్చిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే యువతలు స్లో లివింగ్, ఫెమినినిటీ అండ్ పీస్‌ఫుల్ లైఫ్‌కి ప్రయారిటీ ఇచ్చే కొత్త పోకడగా నిపుణులు పేర్కొ్ంటున్నారు. 2023లో ప్రాంభమైన ఈ ట్రెండ్ ఇటీవల మరింత ఎక్కువ ప్రజాదరణ పొందుతోంది. ఇది గర్ల్‌బాస్ కల్చర్(Hustle and Career Focus)ను తిరస్కరించి సౌకర్యం, స్వస్థత, ఆనందం, వ్యక్తిగత సౌందర్యం వంటి వాటిని ప్రోత్సహిస్తుంది.
జాయ్ అండ్ కంఫర్ట్
తామే నాయకత్వ లేదా ఆధిపత్యం వహించే స్థాయిలో ఉండటం కంటే.. కంఫర్ట్ జోన్‌లో ఉండేందుకే చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. పురుషులతో పోలిస్తే అందమైన వాళ్లు, మృదు స్వభావులు, సౌందర్య ప్రియులు వంటి భావాలకు ఈ ట్రెండ్ ప్రయారిటీ ఇస్తున్నది. కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎక్కువమంది అమ్మాయిలు లేదా మహిళలు మాత్రం దీనినే ఇష్టపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జాయ్ అండ్ కంఫర్ట్‌ను ప్రోత్సహించడం, అనుసరించడంతోపాటు డ్రెస్సింగ్ విషయానికి వస్తే పాస్టెల్ కలర్లు, ఫ్లోరల్ ప్రింట్స్, సాఫ్ట్ మేకప్ (Pink lipgloss, blusher), ఓవర్ సైజ్ హుడీలు ఇందులో భాగమైపోయాయి. పైగా ఈ కాలం(2026) అమ్మాయిలు దీనిని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా జెన్ Z అండ్ మిల్లెనియల్స్‌లో ఇది పాపులర్ అని చెప్పవచ్చు.
బెనిఫిట్స్ ఏమిటి?
ఇక సాఫ్ట్ గర్ల్ ఎరా వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్, స్ట్రెస్ రిడక్షన్, ఇన్నర్ పీస్, సెల్ఫ్-అవేర్‌నెస్, ఫెమినిన్ ఎనర్జీ పెంచుతుందని దీనిని సమర్థించే నిపుణులు, అనుసరించే యువతులు చెబుతున్నారు. అయితే.. అతిగా డిపెండ్ అవడంవల్ల కూడా కొన్ని నష్టాలు ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు. మహిళలు మృదు స్వభావాలు, ఇంటికే పరిమితమై ఉండటం, బాధ్యతలకంటే అందానికి, సౌందర్యానికి ప్రాధాన్యతలు ఇవ్వడం వంటివి ఇతర విషయాల్లో అవాయిడెన్స్ మోడ్‌గా మారి బాధ్యతలు, కెరీర్ అంబిషన్స్‌ను నెగ్లెక్ట్ చేయడానికి దారితీయవచ్చు. ఏది ఏమైనా తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు, నచ్చిన ట్రెండ్స్‌ను అనుసరించే హక్కు మహిళల వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన అంశం. కాబట్టి ’సాఫ్ట్ గర్ల్ ఎరా’ను ఇష్టపడేవారు ఫాలో కావచ్చు. ఇష్టంలేని వారు తమకు నచ్చిన జీవన విధానాన్ని అనుసరించవచ్చు అంటున్నారు నిపుణులు.
Read More..
72 గంటల స్మార్ట్‌ఫోన్ బ్రేక్‌తో మెదడు రీసెట్! ఇంకా ఆ బెనిఫిట్స్ కూడా..






