72 గంటల స్మార్ట్‌ఫోన్ బ్రేక్‌తో మెదడు రీసెట్! ఇంకా ఆ బెనిఫిట్స్ కూడా..

by Javid Pasha |   (  Updated:2026-01-02 10:11:55  IST  )

స్మార్ట్‌ఫోన్ ఉపయోగాన్ని 72 గంటల పాటు కేవలం అవసరమైన కమ్యూనికేషన్‌కు పరిమితం చేస్తే మెదడు ప్రతిస్పందనలపై సానుకూల ప్రభావం చూపుతుంది.

72 గంటల స్మార్ట్‌ఫోన్ బ్రేక్‌తో మెదడు రీసెట్! ఇంకా ఆ బెనిఫిట్స్ కూడా..
X

దిశ, ఫీచర్స్ : మధ్యలో విరామం కూడా ఇవ్వకుండా తరచుగా ఆన్‌లైన్‌లో మునిగిపోవడం, స్మార్ట్‌ఫోన్ చూస్తూ ఉండిపోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లూలైట్ ఎక్స్‌పోజర్ అధిక అలసటకు, మానసిక రుగ్మతలకు దారితీసే చాన్స్ ఉంటుంది. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణం అవుతుంది. అందుకే ప్రతీ 20 నిమిషాలకో, అరగంటకో బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే అప్పటికే ఆన్‌లైన్ వ్యసనంతో ఇబ్బందిపడేవారు తమ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగాన్ని మూడు రోజులపాటు (72 గంటల) చాలా తక్కువగా వాడటం, అవసరమైన కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చునని కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది.

అధ్యయనం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ ఉపయోగాన్ని 72 గంటల పాటు కేవలం అవసరమైన కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగిస్తూ పరిమితంగా వాడటంవల్ల యువకుల మెదడు ప్రతిస్పందనల(brain responses)పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ నియంత్రణ స్మార్ట్‌ఫోన్ వినియోగానికి ముందు, తర్వాత తీసుకున్న బ్రెయిన్ స్కాన్‌లను కూడా నిపుణులు పరిశీలించారు. కాగా సమయాన్ని తగ్గించడం అనేది మెదడు రివార్డ్ ప్రాసెసింగ్, ఇంపల్స్ కంట్రోల్ అండ్ క్రేవింగ్‌లతో ముడిపడిన మెదడు ప్రాంతాల్లో న్యూరల్ యాక్టివిటీలో మార్పులకు కారణమైనట్లు ఈ సందర్భంగా గుర్తించారు. నిజానికి ఈ మెదడు ప్రాంతాలు వ్యక్తుల అలవాట్ల ఏర్పాటు, అలాగే బిహేవియర్ అడిక్షన్‌ (Habit formation and behavioral addiction)లో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే నిరంతర స్మార్ట్‌ఫోన్ ఉపయోగం రివార్డ్ లూప్‌లను బలోపేతం చేస్తుంది. కాబట్టి 72 గంటల బ్రేక్ లేదా లిమిటెడ్ యూజబుల్ అనేది అధిక అలసట, ఆందోళన, మానసి గందరగోళం, మానసిక రుగ్మతలు వంటి వాటిని దూరం చేసి ‘బ్రెయిన్ రీసెట్’లో కీ రోల్ పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

Next Story