ChatGPT Images 2.0 : ఊహ నుంచి వాస్తవం వరకు ఒక్క ప్రాంప్ట్‌తో..!

by Javid Pasha |   (  Updated:2026-04-25 17:44:29  IST  )

పాత వెర్షన్‌తో పోలిస్తే చాట్‌జీపీటీ 2.0 ఇమేజ్‌ను మరింత కచ్చితంగా, క్వాలిటీగా క్రియేట్ చేస్తుంది.

ChatGPT Images 2.0 : ఊహ నుంచి వాస్తవం వరకు ఒక్క ప్రాంప్ట్‌తో..!
X

దిశ, ఫీచర్స్ : ఏఐ అందుబాటులోకి వచ్చాక ఇమేజ్ జనరేటివ్ టెక్నాలజీ మరింత మెరుగుపడుతోంది. ఒకప్పుడు మనం ఊహించిన స్టోరీలు లేదా సిచువేషన్లకు తగిన ఫోటోలు, కార్టూన్లు గీయడం లేదా ప్రత్యక్షంగా తీయడం తప్ప మరో మార్గం లేదు. కానీ ఇప్పుడు ChatGPT వంటి మోడల్స్ జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే కావాల్సిన ఇమేజ్‌లను సులభంగా సృష్టిస్తున్నాయి. ఇలాంటి ఇమేజ్ జనరేటివ్ సేవలు రోజురోజుకూ మరింత శక్తివంతం అవుతున్నాయి. ఇటీవల OpenAI కూడా ఈ రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. ChatGPT Images 2.0 అనే కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

పాత వెర్షన్‌లతో పోలిస్తే ChatGPT Images 2.౦ ఆబ్జెక్టులను ఖచ్చితంగా ఉంచడం, కాంప్లెక్స్ సీన్స్‌లో మల్టిపుల్ ఎలిమెంట్లను సరిగ్గా అమర్చడం, లేఅవుట్‌లను కన్సిస్టెంట్‌గా ఉంచడం వంటి ఫీచర్లలో మరింత మెరుగుదల చూపించింది. ముఖ్యంగా టెక్స్ట్, ఐకాన్స్, యూజర్ ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్లు చాలా స్పష్టంగా రావడం వల్ల డిజైన్, ప్రెజెంటేషన్లు, ఎడ్యుకేషన్ మెటీరియల్ వంటి రియల్ వరల్డ్ పనులకు ఇది చాలా ఉపయోగపడుతోంది. అంతేకాకుండా కొత్త ‘Thinking’ ఫీచర్ (రీజనింగ్ మోడ్) ద్వారా సంక్లిష్టమైన ప్రాంప్ట్‌లను కూడా బాగా అర్థం చేసుకొని, ఒక్క ప్రాంప్ట్ నుంచి 8 వరకు వేర్వేరు ఇమేజ్‌లను సృష్టించగలదు. వెబ్ సెర్చ్ ఉపయోగించి తాజా సమాచారం తీసుకొని మరింత ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది. దీంతో మల్టీ-పేజ్ కామిక్స్, విజువల్ ఎక్స్‌ప్లెయినర్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, స్ట్రక్చర్డ్ డిజైన్లు సులభంగా తయారు చేయవచ్చు.

ఫోటోరియలిస్టిక్ ఇమేజ్‌లు, సినిమాటిక్ సీన్స్, మాంగా, పిక్సెల్ ఆర్ట్ వంటి వివిధ స్టైల్స్‌లో హై క్వాలిటీ ఇమేజ్‌లు సృష్టించడంలో కూడా ChatGPT Images 2.0 రాణిస్తోంది. API ద్వారా 2K రిజల్యూషన్ వరకు సపోర్ట్ ఉండటం మరొక ప్రత్యేకత. పాత Images 1.5తో పోలిస్తే టెక్స్ట్ లోపాలు, లేఅవుట్ సమస్యలు, ఇన్‌కన్‌సిస్టెంట్ డిజైన్లు బాగా తగ్గాయి. ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లోనూ టెక్స్ట్ ఖచ్చితంగా రావడం వల్ల మల్టీలింగ్వల్ సపోర్ట్ కూడా మెరుగుపడింది. దీంతో డిజైన్, ఎడ్యుకేషన్, మార్కెటింగ్, స్టోరీటెల్లింగ్ రంగాల్లో పని చేసే ప్రొఫెషనల్స్‌కు ఇది ఒక శక్తివంతమైన టూల్‌గా మారనుంది. ఏఐ టూల్స్ ఇక రోజువారీ వర్క్‌ఫ్లోలో భాగం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు.

Read More.. వాట్సాప్ మాదిరిగా XChat.. అందుబాటులోకి కొత్త యాప్!

Next Story