- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ మాదిరిగా XChat.. అందుబాటులోకి కొత్త యాప్!
XChat)లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, ఎడిట్ చేయడం, అందరికీ డిలీట్ చేయడం స్క్రీన్‌షాట్ బ్లాక్ వంటి ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి.

దిశ, ఫీచర్స్ : వాట్సాప్ మెసేజింగ్ యాప్ తెలుసు కదా.. అలాగే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X కూడా తన స్టాండ్-అలోన్ మెసేజింగ్ యాప్‌గా XChatను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఐఫోన్, ఐప్యాడ్ వంటి ఐవోఎస్ డివైజ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. యూజర్లు తమ ఎక్స్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేసి, ఎక్స్ కాంటాక్ట్స్‌తో మెసేజింగ్, ఫైల్ షేరింగ్, ఆడియో & వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ చేయవచ్చు. ఇది ఎక్స్ యాప్ లోపలి డైరెక్ట్ మెసేజ్‌లను కాకుండా ప్రత్యేకమైన, డిస్ట్రాక్షన్‌లేని చాట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి రూపొందించబడిందని నిపుణులు అంటున్నారు.
ఎక్స్‌చాట్ (XChat)లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, పిన్ ప్రొటెక్షన్, మెసేజ్‌లను ఎడిట్ చేయడం లేదా అందరికీ డిలీట్ చేయడం, డిస్అపియరింగ్ మెసేజ్, స్క్రీన్‌షాట్ బ్లాక్ వంటి మంచి ప్రైవసీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే యాప్‌లో ఎలాంటి యాడ్స్, ఎటువంటి ట్రాకింగ్‌లు లేవు కాబట్టి ఇది ఎక్స్ యూజర్లకు కొత్త అనుభూతిని ఇస్తుందని X లీడ్ డిజైనర్ బెంజి టేలర్ పేర్కొన్నారు. ‘మెసేజింగ్ కోసం తాము ప్రవేశ పెట్టిన వాటిలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇంకా మెరుగైన ఫీచర్లను సైతం భవిష్యత్తులో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. XChat కేవలం సోషల్ నెట్‌వర్క్‌గా కాకుండా, ఇతర సర్వీసులకు జంపింగ్ పాయింట్‌గానూ ఉపయోగించాలనే X వ్యూహంలో భాగమని నిపుణులు భావిస్తున్నారు. మార్చి 2026లో బీటా టెస్టింగ్ మొదలై ప్రస్తుతం(ఏప్రిల్ 24, 2026, శుక్రవారం) పబ్లిక్ లాంచ్ అయింది.






