- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Natural Viagra : తింటే అస్సలు ఆగరు..! శృంగార కోరికలను పెంచే ఈ ఫ్రూట్ గురించి తెలుసా?
Natural Viagra : తింటే అస్సలు ఆగరు..! శృంగార కోరికలను పెంచే ఈ ఫ్రూట్ గురించి తెలుసా?

దిశ, ఫీచర్స్ : పండ్లు సహజంగానే ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ ఆయా సీజన్లలో మాత్రమే లభిస్తుంటాయి. అలాంటి వాటిలో ఓ రెడ్ కలర్ ఫ్రూట్ కూడా ఉంది. ఇది కేవలం సమ్మర్‌లో మాత్రమే ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి తగిన పోషకాలను అందించడమే కాకుండా శృంగార కోరికలను పెంచడంలోనూ దాదాపు వయాగ్రాలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు పోలుస్తుంటారు. ఇంతకీ ఆ ఫ్రూట్ ఏది? అనుకుంటున్నారా?... పుచ్చకాయ(watermelon).
*వాటర్ మిలన్ అంటేనే వేసవిలో చలువు చేసే పండు మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ ఇదొక నేచురల్ వయాగ్రా కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎరెక్టైల్ డిస్ ఫంక్షన్ కోసం ఇచ్చే మెడిసిన్ లెక్క వేగంగా ప్రభావం చూపగలదని చెబుతున్నారు. కాబట్టి శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకునే దంపతులు దీనిని తప్పక తినాలని సూచిస్తున్నారు. అయితే ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా సెక్సువల్ హెల్త్‌ను మెరుగు పరుస్తుందని, అందులోని సిట్రులిన్ అమ్మేళనమే ఇందుకు కారణమని ఇటీవలి అధ్యయనంలోనూ వెల్లడైంది. సిట్రులిన్ సోర్స్ వాస్తవానికి ఒక అమైనో యాసిడ్. ఇది పుచ్చకాయ తొక్కకు లోపలి భాగంలో తెల్లగా ఉండే పొరలో ఉంటుంది. వాటర్ మిలన్ రెగ్యులర్‌గా తినడంవల్ల శృంగార జీవితానికి ప్రేరణగా నిలిచే పోషకాలు శరీరానికి అందుతాయని 2011 నాటి జర్నల్ ఆఫ్ యూరాలజీ స్టడీలో కూడా వెల్లడైంది.
* పుచ్చకాయ కేవలం సెక్సువల్ హెల్త్ కే కాదు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఎ ఉంటాయి. లైసోపీన్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మినరల్స్ నిండుగా ఉంటాయి. 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పుచ్చకాయను తినడం బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More : జామకాయలను రోజూ తినాలంటున్న నిపుణులు.. ఎందుకంటే..?
Read More : నల్ల ద్రాక్ష శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు?






