జామకాయలను రోజూ తినాలంటున్న నిపుణులు.. ఎందుకంటే..?
రోజుకో యాపిల్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని డాక్టర్ చెబుతున్నారు.
అయితే, వాస్తవానికి యాపిల్ పండ్లు చాలా ఖరీదైనవి. వీటిని అందరూ కొనుక్కొని తినలేరు.
యాపిల్స్ తినలేకపోయినా.. వాటికి ఏ మాత్రం తీసిపోని జామకాయను తినాలని నిపుణులు చెబుతున్నారు.
జామకాయలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
జామకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గిస్తుంది.
అలాగే, ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే, హైబీపీ రాకుండా ఉండాలన్నా.. బీపీ నియంత్రణలో ఉండాలన్నా జామకాయలను తింటూ ఉండాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.