నల్ల ద్రాక్ష శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

నల్లద్రాక్ష చిన్నగా ఉన్నప్పటికీ మన శరీరానికి బోలేడు ప్రయోజనాలను కలిగిస్తాయి. చాలామంది కొన్ని పుల్లగా ఉంటాయని వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ నల్లద్రాక్షతో చాలా లాభాలు కలుగుతాయి.
ఇందులో ఉండే పాలీఫెనాల్స్‌ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్రలో పోషిస్తాయి.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు నల్లద్రాక్షను తినడం వల్ల నాజుకుగా అయ్యేలా సహాయం చేస్తుంది.
నల్ల ద్రాక్షలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఇందులోని నీరు శాతం బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
నల్ల ద్రాక్ష తింటే జుట్టు రాలడం ఈ సమస్యలను తగ్గించడంతో పాటు చుండ్రును తగ్గిస్తుంది.
గుండె జబ్బులను నివారించడంలో నల్లద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
నల్లద్రాక్షలోని రెస్వెరాటర్ అనే పదార్థం ఉండి మధుమేహాన్ని తగ్గిస్తుంది. అలాగే వీటి వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.