- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్ని వ్యాయామాలు చేసినా పొట్ట రావడానికి అదే కారణం!
ప్రస్తుత రోజుల్లో చాలామందిని పొట్ట సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలామందిని పొట్ట (stomach) సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పెద్దగా తినకపోయిన కూడా పొట్ట మాత్రం పెరిగిపోతుందని ఆందోళన చెందుతుంటారు. పొట్ట వల్ల అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలుగుతుంది. పొట్ట కారణంగా మధుమేహాం, బీపీ, హృద్రోగాలు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే పొట్ట తగ్గించుకునేందుకు రకరకాల వ్యాయామాలు, డైట్‌లు (Exercises, diets) చేస్తుంటారు. అయితే కొంతమంది ఎన్ని వ్యాయామాలు చేసినా.. ఎంత కఠిన ఆహార నియమాలు పాటించినా పొట్ట అస్సలు తగ్గదు. ఇందుకు కారణాలను తాజాగా పరిశోధకులు కనిపెట్టారు.
సాధారణంగా పొట్ట పెరగడం అనేది శరీరంలో ఉన్న కండరాలు క్రమంగా తగ్గి, వాటి స్థానంలో కొవ్వు చేరడం వల్ల జరుగుతుంది. ఈ కొవ్వు 'వైట్ అడిపోజ్ టిష్యూ (WAT)' అనే కణజాలం ద్వారా ఏర్పడుతుంది. ఈ కణజాలాన్ని ప్రేరేపించే ముఖ్యమైన కారకం ఒక ఏపీసీ అనే మూలకణం (Adult Stem Cell) అని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఈ ఏపీసీ, వైట్ అడిపోజ్ టిష్యూను అధికంగా ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపించి, శరీరంలో అధిక కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది. దీని వల్ల శరీర బరువు పెరగడం, పొట్ట వచ్చేయడం మాత్రమే కాకుండా, అనేక జీర్ణ సంబంధిత మరియు జీవకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తోంది. ఇటీవల అమెరికాలో 50 ఏళ్ల పైబడిన వందలాది మందిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను నియంత్రించేందుకు, ఈ మూలకణాన్ని ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఔషధాలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Read more: డైట్ డైట్ అంటారు.. కానీ ఎలాంటి డైట్ చేయాలో ఎవరూ చెప్పరు.






