- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్
డైటింగ్.. డైటింగ్ అని ప్రాణాలమీదికి తెచ్చుకోకండి. చూశాం కదా. కేరళలో శ్రీనంద అనే యువతి బరువు తగ్గేందుకు డైటింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకుంది. సోషల్ మీడియాలో దొరికే ఉచిత సలహాలను పాటించి కడుపు మాడ్చుకొని 5 నెలల పాటు నీళ్లు మాత్రమే తాగి రిస్క్ చేసి చనిపోయింది. ఈ ఘటన తర్వాత డైటింగ్.. వెయిట్ లాస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. సొంత ప్రయోగాలకు పోకపోవడమే మంచిదంటున్నారు. ఎదురొచ్చిన ప్రతీ టిప్‌ను పాటించి ఆరోగ్యం పాడు చేసుకోవడం కాదు.. హెల్దీ డైట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటదంటున్నారు. ఘనాహారం తీసుకోవద్దు.. అని కొందరు 24 గంటలు.. 72 గంటలు అంటూ నీళ్లు మాత్రమే తాగి ప్రమాదంలో పడుతున్నారు. అలా కాకుండా రోజూ తీసుకునే ఆహారంలో 500 క్యాలరీల చొప్పన తగ్గిస్తే వారానికి 0.5 కిలోల.. నెలకు 2 కిలోల బరువు తగ్గుతారని నిపుణలు సూచిస్తున్నారు. సో.. సొంత ప్రయోగాలు కొంత మానుకొని ఆరోగ్య నిపుణులు.. డాక్టర్లు సూచించే డైట్ పాటిస్తే బరువు తగ్గొచ్చు.. ఆరోగ్యంగానూ ఉండొచ్చు.






