- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిరుచినే వ్యాపారంగా మలిచి.. ఓ యువతి సక్సెస్ జర్నీ..
ఆమె ఇటాలియన్ స్టైల్ ఫిల్డ్ డోనట్స్ అయిన బాంబోలోని తయారు చేసి అమ్మడం మొదలు పెట్టింది. కేవలం 6 నెలల్లోనే ₹4 లక్షల రెవెన్యూ సాధించింది.

దిశ, ఫీచర్స్ : ‘బలమైన ఆలోచన ఉండాలే గానీ ఏదో ఒకరోజు అవకాశాలను క్రియేట్ చేసుకోవచ్చు. లక్ష్యం ఉండాలే గానీ ఏదో రోజు టార్గెట్ రీచ్ అవ్వొచ్చు’ అంటుంటారు మోటివేటర్లు. ముంబైకి చెందిన ఓ యువతి సరిగ్గా అదే చేసింది. ఓ వైపు చదువుకుంటూనే తనలో ఉన్న ఆలోచనను, అభిరుచిని ఆచరణలో పెడుతూ వ్యాపారంగా మల్చుకున్నది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మార్కెట్ చేసుకుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైనా పట్టువిడువకుండా ప్రయత్నించి రెండోసారి సక్సెస్ అయింది. జస్ట్ ఆరు నెలల్లోనే సేల్స్ ద్వారా రూ. 4 లక్షల రెవెన్యూ సాధించింది.
విఫలమైనా వెనక్కి తగ్గలే..
పేరు సమృద్ధి ఎలంథోలి. వయసు 19 ఏళ్లు. ముంబైకి చెందిన ఈమె ప్రజెంట్ లా స్టూడెంట్, 12th చదువుతున్నప్పుడే హోమ్ మేడ్ కేక్ వ్యాపారం స్టార్ట్ చేసి, ఓటమిని చవిచూసింది. అయితే 2025లో లా జాయ్ (La Joie) అనే బ్రాండ్ పేరుతో మళ్లీ ప్రారంభించింది. ఈసారి ఆమె ఇటాలియన్ స్టైల్ ఫిల్డ్ డోనట్స్ అయిన బాంబోలోని(Bomboloni) తయారు చేసి అమ్మడం మొదలు పెట్టింది. ఆమె వ్యూహం సక్సెస్ అయింది. కేవలం ఆరు నెలల్లోనే తన హోమ్ బేకరీ నుంచి ₹4 లక్షల రెవెన్యూ సాధించింది. ఇందులో దాదాపు 70% సేల్స్ బాంబోలోని నుంచే వచ్చాయి.
నిజాయితీకి మెచ్చి..
సమృద్ధి ఎలంథోలి(Samriddhi Elantholy) సక్సెస్ కావడానికి మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే.. సోషల్ మీడియా. ఇన్‌స్టాగ్రామ్‌లో నిజాయితీగా బేకింగ్ ప్రాసెస్, బిజినెస్ మూమెంట్స్ చూపించే రీల్స్ చేయడమే. తన ఇంట్లోనే కేకులు, బాంబోలోని ఎలా తయారు చేస్తారో, ఎంత పరిశుభ్రత పాటిస్తారో చూపించడం చాలామందికి నచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఆమె 450కి పైగా కస్టమర్లను సంపాదించుకుంది. ఓ వైపు చదువుకుంటూనే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తూ, చదువు&ఆర్డర్ల మధ్య సమతుల్యం సాధిస్తోంది సమృద్ధి. భవిష్యత్తులో సొంత ఫుడ్ ట్రక్ లాంచ్ చేయాలనేది తనలక్ష్యమని చెబుతోంది. చదువుకుంటున్న వయసులోనే తన అభిరుచిని వ్యాపారంగా మార్చి, కష్టపడి ముందుకు సాగుతున్న ఈ యువతికథ యువతకో స్ఫూర్తి అంటున్నారు నిపుణులు.
Read Also..






