- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హల్వా అమ్ముతూ కోటి రూపాయల టర్నోవర్.. ఓ గ్రామీణ మహిళ సక్సెస్ జర్నీ..
పెట్టుబడి, ప్రత్యేక గది, ఫ్యాక్టరీ ఏవీ లేకుండానే ఒక స్మార్ట్ మోడల్‌ను రూపొందించింది పావని బుగత. ఇప్పుడు రూ. 1 కోటి టర్నోవర్ సాధిస్తోంది

దిశ, ఫీచర్స్ : ఒక వ్యాపారం ప్రారంభిచాలంటే.. ఆలోచన ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆర్థిక స్థితి బాగుండాలి. వేలల్లో, లక్షల్లో పెట్టుబడి పెట్టగలగాలి అంటుంటారు చాలామంది. ఇది నిజమే. కానీ అరుదుగా కొందరు అలాంటి పరిస్థితులు లేకపోయినా అడుగుముందుకు వేస్తూ అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఆ కోవకు చెందిన మరో వ్యక్తే పావని బుగత (Pavani Bugatha). చేతిలో వెయ్యి రూపాయలు కూడాలేని పరిస్థితిలో హల్వా బిజినెస్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు కోటిరూపాయల టర్నోవర్ గల ఎంపైర్‌గా మారి, ఆదర్శంగా నిలుస్తున్నది. ఇంతకీ అదెలా సాధ్యమైంది?
సొంత గుర్తింపుకోసం..
పావని బుగత సొంతూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లాలోని మాడుగుల. ఇది విశాఖ నుంచి సుమారు 90 కి.మీ దూరంలో ఉన్న రిమోట్ ఏరియా. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం ఆమెది. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. పూణేలోని Symbiosisలో ఎంబీఏ సీటు కూడా సాధించింది. అయితే అప్పటికే ఆమె పెళ్లి కూడా అయిపోయింది. చదువుకంటే కూడా ఏదో ఒకటి సొంత గుర్తింపు సాధించాలన్న తపన ఆమెలో బలంగా ఉండిపోయింది. ఖాళీగా సమయాల్లో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. కానీ ఈ సందర్భంగా ఆమె చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నది. దీంతో రీల్స్ చేయడం మానేసిన పావనికి చిన్నగా ఏదైనా సొంత వ్యాపారం స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. భర్తతో అదే చెప్పింది. అతను కూడా ఆమె ఆలోచనతో ఏకీభవించి ప్రోత్సహించాడు.
మొదటి అడుగు..
ఆమె మాడుగల ప్రాంతంలోని సాంప్రదాయిక గోధమ హల్వా రెసిపీని తన మొదటి వ్యాపార ప్రయత్నంగా ఎంచుకుంది. బ్రాండ్ నేమ్ కూడా ఆమె ఊరిపేరునే పెట్టుకుంది. అంటే పావని మడుగుల హల్వా అంటారు. నిజానికి ఇది బెల్లం, పాలు, గోధుమసారం, నీటితో తయారవుతుంది. చక్కెర నూనె, ప్రిజర్వేటివ్స్ లేకుండా పూర్తి ఆరోగ్యకరమైనది కూడా. ఒక రోజు పావని దీనిని తయారు చేస్తూ.. హల్వా గురించి రీల్ చేసింది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగవైరల్ అయింది. చాలామంది తమకు కావాలని, డబ్బులు ఇస్తామని, ఎక్కడ దొరుకుతుందో ఆర్డర్ చేయాలని అడగడంతో ఆమె ఆశ్చర్యపోయింది. గోధుమ హల్వాను తనే తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. తన సొంత ఎదుగుదలకు దీన్నొక అవకాశంగా మల్చుకోవాలనుకుంది. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. అయితేనే ధైర్యంగా అడుగుముందుకు వేసింది.
పెట్టుబడిలేకుండానే..
పెట్టుబడి, ప్రత్యేక గది, ఫ్యాక్టరీ వంటివి ఏవీ లేకుండానే ఒక స్మార్ట్ మోడల్‌ను రూపొందించింది పావని బుగత. ఏంటంటే.. ఆర్డర్లు ముందుగా తీసుకుని, చెల్లింపు అయిన తర్వాతనే హల్వా తయారు చేసి పంపేది. ఎవరో కొంటారని ముందుగా తయారు చేసి స్టోర్ చేసేది కాదు. ప్రజర్వేటివ్స్ అసలే లేవు. కేవలం ఆర్డర్లు వచ్చాకే హల్వా చేసి పంపడమే తన వ్యాపారంగా పెట్టుకుంది. మొదట్లో రెండో మూడో వచ్చే ఆర్డర్ల సంఖ్య క్రమంగా పదుల్లో, వందల్లో, వేలల్లో పెరుగుతూ వచ్చింది. క్రమంగా ఆర్థిక పరిస్థితి బాగుపడింది.
రోజుకు 80-100 కిలోలు..
సొంతంగా తన ఇంటిలోనే ఒక గదిని హల్వా తయారీకోసం కేటాయించింది. గుంటూరులో ఆమె మొదటి ఫ్రాంచైజీ ప్రారంభించింది. రోజుకు 80-100 కిలోల హల్వా అమ్ముతూ దేశం నలు మూలలా, విదేశాల్లోనూ 20, వేలమందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆమె హల్వా విక్రయాల బిజినెస్ రూ. ₹1 కోటి ఎంపైర్‌గా మారింది. కాస్త అటూ ఇటూ అయినా కనీసం 80 లక్షల టర్నోవర్ పక్కా సాధిస్తుంది. పావని కథ మనకు నేర్పేది ఏమిటంటే.. ఆసక్తి, లక్ష్యం, పట్టుదల ఉండాలేగానీ పెట్టుబడి లేకపోయినా.. నిరంతర కృషి, శ్రమతో కూడా పెద్ద విజయాలు సాధ్యం అవుతాయి.
Read Also..






