Hot bedding : అక్కడ అద్దె చెల్లించి మంచంపై పక్కన పడుకోవచ్చు..! ఇదో నయా ట్రెండ్ గురూ!!

by Javid Pasha |   (  Updated:2025-05-05 05:36:04  IST  )

Hot bedding : అక్కడ అద్దె చెల్లించి మంచంపై పక్కన పడుకోవచ్చు..! ఇదో నయా ట్రెండ్ గురూ!!

Hot bedding : అక్కడ అద్దె చెల్లించి మంచంపై పక్కన పడుకోవచ్చు..! ఇదో నయా ట్రెండ్ గురూ!!
X

దిశ, ఫీచర్స్ : సమాజంలో రకరకాల పోకడల గురించి మీరు వినే ఉంటారు. అప్పుడప్పుడూ పుట్టుకొచ్చే కొన్ని నయాట్రెండ్స్ అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అవునా.. ఇది నిజమా అనేలా వింతగొల్పుతుంటాయి. పలు సందేహాలను రేకెత్తిస్తుంటాయి. స్లీప్ డివోర్స్, ఫ్రెండ్ షిప్‌మ్యారేజ్, లివ్ ఇన్ రిలేషన్, కో స్లీపింగ్ వంటి పోకడల గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇటీవల ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ఓ నయా ట్రెండ్ నడుస్తోంది. అదే ‘హాట్ బెడ్డింగ్’

హాట్ బెడ్డింగ్ అంటే?

హాట్ బెడ్డింగ్ (hot bedding) అనేది ఇటీవల ముందుకొచ్చిన ఒక వినూత్నమైన భాగస్వామ్య జీవన ఏర్పాటు(an innovative shared living arrangement). దీని ప్రకారం ఒక వ్యక్తి తన మంచంలోని సగభాగంలో మరొక వ్యక్తి పడుకోవడానికి అద్దెకు ఇస్తారు. అలా ఇచ్చేవారు, పుచ్చుకునే వారు స్త్రీ, పురుషులు ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ జెండర్‌తో సంబంధం లేదు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే మంచంలో పడుకుంటారు. అలాగని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పద్ధతిలో స్పష్టమైన బౌండరీస్, రూల్స్, ప్రైవసీ వంటివి పాటించాలనే నియమం కూడా ఉంటుంది.

ఎలా పుట్టుకొచ్చింది?

కోవిడ్ - 19 మహమ్మారి సమయంలో క్వీన్స్‌లాండ్‌కు మోనిక్ జెరెమియా (Monique Jeremiah) అనే మహిళ ఆర్థిక ఇబ్బంది నుంచి బయట పడేందుకు ఆమె తన మంచంలో ఒకవైపు (సగభాగం) కేవలం ఫ్రెండ్లీ అరైంజ్‌మెంట్‌గా నెలకు రూ. 32 వేలకు (A$600) అద్దెకు ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె ఈ వినూత్నమైన ఐడియాను వ్యాపారంగా మల్చుకుంది. ‘హాట్ బెడ్డింగ్’ పేరుతో బిజినెస్ ప్రాంభించి మొదటి అతిథిగా తన మాజీ ప్రియుడికి అద్దెకు ఇచ్చింది. క్రమంగా ఎక్కువ మొత్తంలో చెల్లించి అద్దె ఇండ్లల్లో ఉండలేని తక్కువ ఆర్థిక స్థోమత గలవారికి, ఒంటరిగా ఉండేవారికి మంచంలోని సగభాగం అద్దెకివ్వడమనే వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తూ రావడంతో అది పాపులర్ ట్రెండ్‌గా మారింది.

ఎక్కడ పాటిస్తారు?

ప్రస్తుతం ఆస్ట్రేలియా, పలు ఇతర విదేశాల్లో హాట్ బెడ్డింగ్(hot bedding) ట్రెండ్ విస్తరిస్తోంది. అద్దె ఇండ్ల మాదిరిగానే మంచంలో తమ పక్కనే సగభాగం అద్దెకివ్వడమనేది చాలామంది ఒక వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సోలో టూరిస్టులు, ఒంటరి వ్యక్తులు, పేదలు దీనిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. నెలకు కొద్దిమొత్తంలో చెల్లించి ఇతరుల మంచాలపై వారి పక్కన పడుకోవడానికి స్థలాన్ని అద్దెకు తీసుకుంటున్నారు. ఈ సరికొత్త పోకడ తమలో ఆర్థిక ఒత్తిడి(financial stress)ని, ఒంటరితనాన్ని ( loneliness) తగ్గించే క్రియేటివ్ సొల్యూషన్‌గా భావిస్తున్నారు పలువురు ఆస్ట్రేలియన్ పీపుల్.

Read More..

ప్రియురాలితో గొడవ.. ఎత్తైన భవనం కిటికీ లోంచి దూకేసిన ప్రియుడు.. చివరికి ఏమైందంటే?


Next Story