- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో లవ్.. నో ఫ్రెండ్‌షిప్.. నగర జీవితాల్లో దెబ్బతింటున్న మానవ సంబంధాలు!
సిటీలైఫ్‌లో మొత్తానికే మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నదని, ఆసక్తి తగ్గుతున్నదని కాదు కానీ. సంబంధాల నిర్వహణపై ఫోకస్ చేసే సమయం చాలా వరకు తక్కువగా ఉంటోంది.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ప్రేమ అనేది కేవలం మనిషి, మనసుకు సంబంధించిన అంశాలపై ఆధారపడిన విషయంగా భావించేవాళ్లు చాలామంది. కానీ ఇప్పుడది పరిస్థితులు, సమయం, సందర్భం వంటి విషయాలను బట్టి మానవ సంబంధాలను ప్రభావితం చేస్తున్నదని నిపుణులు అంటున్నారు. ‘హ్యూమన్ రిలేషన్స్’పై పలు సంస్థలు నిర్వహించిన గత సర్వేలు కూడా ఇదే పేర్కొంటున్నాయి. ముఖ్యంగా లవ్, ఫ్రెండ్‌షిప్, డేటింగ్ వంటి సంబంధాలు రూరల్ ఏరియాలకంటే నగర జీవితంలో భిన్నంగా ఉంటున్నాయి. ఓ వైపు ఆధునిక సౌకర్యాలు, అభివృద్ధి, టెక్నాలజీ పరంగా నగరాలు దూసుకుపోతున్నప్పటికీ, మెరుగైన మానవ సంబంధాల నిర్వహణలో మాత్రం కొంత వెనుకబడుతున్నాయి.
కారణం అదేనా?
ఉరుకులూ పరుగుల జీవితాలు, కెరీర్‌కు మాత్రమే అత్యధిక ప్రయారిటీ ఇవ్వాల్సిన తప్పని పరిస్థితులు నగరాల్లో నివసిస్తున్న వారు ప్రేమానురాగాలను పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితులకు కారణం అవుతున్నాయని థ్రైవింగ్ సెంటర్ ఆఫ్ సైకాలజీ(thrivingcenterofpsych) నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే పేర్కొన్నది. పట్టణాలు, నగరాలు, మెట్రో సిటీలు విస్తరిస్తున్న కొద్దీ, లోతైన ప్రేమలు, మానవ సంబంధాల విషయంలోనూ ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. సర్వేలో భాగంగా 900 మందికిపైగా సింగిల్ అడల్ట్స్‌ను ప్రశ్నించిన నిపుణులు అందుకు గల కారణాలను విశ్లేషించారు. మెరుగైన జీవితాలు, ఉన్నతమైన కెరీర్, ఉన్న ఉద్యోగాలను నిలబెట్టుకోవాలనే ఆరాటం, వృత్తి జీవితాల్లోని పని పరిస్థితులు వంటి విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈతరం(Generation Z) యువతీ యుకులు, పెద్దలు కూడా తగినంత సమయం లేకపోవడం, బిజీ లైఫ్ షెడ్యూల్స్ కారణంగా ప్రేమ, స్నేహం, డేటింగ్ విషయాల్లో తక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. కుటుంబాలతో కలిసి ఎక్కువ సమయం గడపడం, పర్యటనలు, ప్రయాణాలు, శుభకార్యాలు వంటి వాటికి వెళ్లలేని పరిస్థితులను నగరాల్లో జీవిస్తున్న వారు ఎదుర్కొంటున్నారు.
సమయం లేకపోవడమే సమస్య
నిపుణుల ప్రకారం.. సిటీలైఫ్‌లో మొత్తానికే మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నదని, ఆసక్తి తగ్గుతున్నదని కాదు కానీ. సంబంధాల నిర్వహణపై ఫోకస్ చేసే సమయం చాలా వరకు తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితులే ప్రేమ, స్నేహం, డేటింగ్, పరస్పర మానవ చర్యల విషయంలో దృష్టి పెట్టలేకపోవడానికి కారణం అవుతున్నాయి. కొన్నిసార్లు ఇవి మానవుల మధ్య విభేదాలకు, నమ్మకంలేని ప్రవర్తనలకు సైతం దారితీస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత దేశంలో మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి. న్యూయార్క్ సిటీలో అయితే మానవ సంబంధాల నిర్వహణకు ఆటంకం కలిగించే పరిస్థితులు మరింత ఎక్కువగా ఉన్నాయని థ్రైవింగ్ సెంటర్ ఆఫ్ సైకాలజీ సర్వేలు పేర్కొంటున్నాయి.
డేటింగ్‌పై తగ్గుతున్న ఆసక్తి
ఇక డేటింగ్ యాప్‌లు, సైట్ల వినియోగం, ప్రపోజల్ ఓకే అయ్యాక డేటింగ్‌కు వెళ్లడం వంటి విషయాల్లో మంచీ చెడు, జీవన వ్యయం, సోషల్ బర్న్ అవుట్, హ్యూమన్ రిలేషన్స్ వంటి అంశాలను పరిశీలించిన నిపుణులు, డేటింగ్ సంస్కృతి పదేండ్ల కిందట యువతలో సంతృప్తికి కారణమయ్యేది, కానీ ఇటీవల బిగ్గెస్ట్ సిటీస్‌లలో ఈ పరిస్థితి మారుతోంది. లోతైన మానవ సంబంధాలను ఏర్పర్చుకోవడంలో ఇది సవాలుగా మారుతోంది. దీంతో సంబంధాలకోసం డేటింగ్ యాప్‌లపై ఆధారపడేవారు కూడా తగ్గుతున్నారు. వేగవంతమైన జీవన శైలి, అధిక జీవన వ్యయం, కెరీర్‌పై దృష్టి సారించే సంస్కృతి వంటివి వ్యక్తిగత సంబంధాలను పెంపొందించడంలో ఇప్పుడు సవాళ్లుగా మారుతున్నాయి.
Read More..
Technology : ఎమోషనల్ సపోర్ట్ కోసం ఏఐ.. 33% మందికి అదే బెస్ట్ ఫ్రెండ్ !






