- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : ఎమోషనల్ సపోర్ట్ కోసం ఏఐ.. 33% మందికి అదే బెస్ట్ ఫ్రెండ్ !
మూడింట ఒక వంతుమంది ఇప్పుడు ఏఐని ఎమోషనల్ సపోర్ట్ లేదా సామాజిక సంభాషణల కోసం ఉపయోగిస్తున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు కేవలం సాంకేతికపరమైన అంశాలకే పరిమితమై లేదు. మానవులకు భావోద్వేగ మద్దతును అందించడంలోనూ కీ రోల్ పోషిస్తోంది. యూకేకు చెందిన ఏఐ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్(AISI)కు చెందిన నిపుణులు 2,028 మంది అడల్ట్స్‌పై నిర్వహించిన మొదటి ఫ్రాంటియర్ ఏఐ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం.. మూడింట ఒక వంతుమంది (సుమారు 33 శాతం) ఇప్పుడు ఏఐని ఎమోషనల్ సపోర్ట్ లేదా సామాజిక సంభాషణల కోసం ఉపయోగిస్తున్నారు. కాగా ఇందులో 8 శాతం మంది వారానికి ఒకసారి, 4 శాతం మంది ప్రతిరోజూ ఏఐని భావోద్వేగ అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అత్యధికంగాచాట్ జీపీటీ (ChatGPT) వంటి సాధారణ చాట్‌బాట్‌లు (సుమారు 60 శాతం) వరకు భావోద్వేగ మద్దతు కోసం ఉపయోగించబడుతున్నాయి. తర్వాత అలెక్సా (Alexa) వంటి వాయిస్ అసిస్టెంట్‌లను ఉపయోగిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఏఐతో సానుకూల అనుభవాలు పొందుతున్నప్పటికీ, కొన్ని హై-ప్రొఫైల్ కేసుల్లో ప్రతికూల ప్రభావాలు చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి. తరచుగా ఏఐని ఉపయోగించడానికి అలవాటు పడటంవల్ల అది అందుబాటులో లేనప్పుడు ఆందోళన, డిప్రెషన్ వంటి విథ్‌డ్రాయల్ లక్షణాలు సైతం కొందరిలో కనిపిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ ఏఐకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. పైగా ఇది కేవలం టూల్ మాత్రమే కాదు, వినియోగదారుల్లో అనేకమందికి అదొక సహచరుడి(companion)గా, స్నేహితుడిగా మారుతోంది.
Read More..
చలికాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు.. ఇలాంటి వారిలోనే అధికం!






