కేవలం 8 నిమిషాల కోపం.. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుందా?

by Javid Pasha |   (  Updated:2026-02-16 07:32:17  IST  )

కేవలం 8 నిమిషాల తీవ్రమైన కోపం రక్తనాళాల సామర్థ్యాన్ని 50% తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

కేవలం 8 నిమిషాల కోపం.. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుందా?
X

దిశ, ఫీచర్స్ : అనవసరంగా కోపం తెచ్చుకోవడం మంచి లక్షణం కాదంటారు పెద్దలు. అయితే అది గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం 8 నిమిషాల తీవ్రమైన కోపం మీ రక్త నాళాల పనితీరును దాదాపు ఒక గంటపాటు ‘పెరాలిలిస్’ వంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుందని కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన నిపుణుల పరిశోధనలో తేలింది. ఇందులో భాగంగా 280 మంది ఆరోగ్యవంతులను పరిశోధకులు విశ్లేషించారు.

కేవలం 8 నిమిషాల తీవ్రమైన కోపం లేదా కోపాన్ని రేకెత్తించే పరిస్థితుల ప్రభావం బాధిత వ్యక్తుల్లో రక్తనాళాల సామర్థ్యం(Endothelium-dependent vasodilation) సుమారు 50% తగ్గిపోయిందని, ఈ ప్రభావం 40 నిమిషాల వరకు కొనసాగిందని పరిశోధకులు గుర్తించారు. ఇక కోపంతో పోలిస్తే.. దుఃఖం లేదా ఆందోళన వంటి ఇతర భావోద్వేగాలు రక్తనాళాల పనితీరుపై అంత పెద్ద ప్రభావం చూపలేదని కూడా గమనించారు. కోపంవల్ల మాత్రమే రక్తనాళాల అంతర్భాగం (endothelium) గట్టిపడి, రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని పరిశోధన స్పష్టం చేసింది. తరచుగా కోపం తెచ్చుకునేవారిలో ఇది క్రమంగా గుండె హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి పరిస్థితులకు దారితీసే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు కూడా తీవ్రమైన భావోద్వేగం, తీవ్రమైన కోపం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, కాబట్టి వాటి నియంత్రణ ముఖ్యమైని చెబుతున్నారు. అందుకే వీలైనంత మేరకు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఆర్థిక ఒత్తిడి.. మీ హృదయానికి హాని చేస్తుంది..! పరిశోధనల్లో వెల్లడి

Next Story