- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఒత్తిడి.. మీ హృదయానికి హాని చేస్తుంది..! పరిశోధనల్లో వెల్లడి
దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే వ్యక్తులు పేలవమైన ఆహారం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికంటే కూడా ఎక్కువగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాలను ఎదుర్కొంటారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : అధిక ఒత్తిడి మాత్రమే కాదు.. ఆర్థిక ఒత్తిడి కూడా మీ హృదయానికి హాని చేస్తుందని ఆధునిక పరిశోధనలు పేర్కొంటున్నాయి. ‘సోషల్ కార్డియాలజీ’ మయో క్లినిక్ ప్రొసీడింగ్స్- 2025-2026’ స్టడీస్‌లోనూ ఇది వెల్లడైంది. ముఖ్యంగా క్రానిక్ ఫైనిన్షియల్ స్ట్రెస్ గుండెకు నేరుగా హాని చేసే జీవసంబంధిత ప్రక్రియను (biological cascade) ప్రారంభిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అదెలాగో చూద్దామా!
ఫైట్ -ఆర్- ఫ్లైట్ మోడ్‌లోకి శరీరం..
అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కోవడం మానవ సహజం. కానీ అవి దీర్ఘకాలంపాటు అధికస్థాయిలో కొనసాగుతూ ఉంటే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. డబ్బు గురించి నిరంతరం ఆందోళన చెందడం కూడా అలాంటి ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు చెబుతున్నాయి. ఆర్థిక ఆందోళన లేదా ఒత్తిడి వల్ల సహజంగానే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శరీరం ఎప్పటికప్పుడు “ఫైట్-ఆర్-ఫ్లైట్” మోడ్‌లో ఉంటుంది. దీని వల్ల నిద్ర దెబ్బతింటుంది. బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. రక్తనాళాలు తీవ్రంగా స్పందిస్తుంటాయి. శరీంరలో వాపు (inflammation) పెరుగుతుంది. ఇవన్నీ కలిసి హృదయ సంబంధిత వ్యాదులకు (cardiovascular disease) దారితీస్తాయని పరిశోధల్లో తేలింది.
హార్ట్ ఎటాక్.. స్ట్రోక్ రిస్క్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే వ్యక్తులు పేలవమైన ఆహారం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికంటే కూడా ఎక్కువగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాలను ఎదుర్కొంటారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ విధమైన ఫైనాన్షియల్ స్ట్రెస్ కారణంగా మెదడు “భద్రత లేదు” అని భావిస్తుంది. ఇది హృదయానికి సంకేతాలను పంపుతుంది. దీంతో గుండెకు ముప్పు సంభవిస్తుంది. అంటే దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి కేవలం మానసికపరమైనది మాత్రమే కాదు. దాని నుంచి బయటపడకపోతే హార్మోన్లు, రక్తనాళాలు, జీవక్రియను మార్చడం ద్వారా కాలక్రమేణా మీ హృదయ వ్యవస్థను లేదా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అధిక ఆందోళన, అధిక ఒత్తిడి నుంచి జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలంపాటు కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.






