అహనా అన్‌జంక్‌ ఛాలెంజ్.. ఓపెన్ సీక్రెట్.!

by Daayi Srishailam |   (  Updated:2025-12-25 06:50:36  IST  )

జంక్‌ను దూరంచేసి ఇండియన్ స్నాక్‌ను ''అన్‌జంక్'' చేయాలనే లక్ష్యంతో ఓపెన్ సీక్రెట్ ఛాలెంజ్ చేస్తోంది

అహనా అన్‌జంక్‌ ఛాలెంజ్.. ఓపెన్ సీక్రెట్.!
X

దిశ, ఫీచర్స్: పిల్లలు తినే ఫుడ్ ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా.? బయట దొరికే స్నాక్స్ అయితే మరీ ఘోరం. జంక్‌ఫుడ్‌‌కు అలవాటు పడి వేరే ఫుడ్ తినమంటే మొండికేస్తున్నారు. జంక్‌ను దూరంచేసి ఇండియన్ స్నాక్‌ను ''అన్‌జంక్'' చేయాలనే లక్ష్యంతో ఓపెన్ సీక్రెట్ ఛాలెంజ్ చేస్తోంది అహనా గౌతమ్.

మెరుగైన స్నాక్స్ కోసం..

అహనా ఐఐటీ బాంబే నుంచి ఇంజినీరింగ్.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేసింది. అమెరికాలో ఎంబీఏ చదువుతున్న సమయంలో "వోల్ ఫుడ్ స్టోర్స్"ను సందర్శించింది. అక్కడ ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ చూసి.. ఇండియాలో ఇలాంటి మెరుగైన స్నాక్స్ లేవని గుర్తించింది. ఇండియన్స్ స్నాక్స్‌లో మైదా.. రిఫైన్డ్ షుగర్.. పామ్ ఆయిల్ వంటి అనారోగ్య పదార్థాలు ఎక్కువగా ఉండటం ఆమెను కలచివేసింది. ఈ ఆలోచనతోనే 2019లో "ఓపెన్ సీక్రెట్"ను స్థాపించింది. కో-ఫౌండర్ ఉదిత్ కేజ్రీవాల్‌తో కలిసి ముంబైలో ఈ వెంచర్‌ను స్టార్ట్ చేసింది.

రూ.100 కోట్ల టర్నోవర్..

"ఓపెన్ సీక్రెట్" పేరు ఎందుకు పెట్టారంటే.. ఆరోగ్యకరమైన ఆహారం రహస్యం కాదు కదా.. ఇది అందరికీ తెలుసు కాబట్టీ తమ బ్రాండ్‌కు ఆ పేరు పెట్టారు. "ఓపెన్ సీక్రెట్" ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ హెల్దీ స్నాక్స్ బ్రాండ్లలో ఒకటి. ఇది దినదినంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. విస్తరణ కూడా పెరుగుతోంది. ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ 2024 నాటికి రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. 2025లో మరింత వృద్ధి చెంందుతూ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసంది. 2025 నవంబర్లో మిల్లెట్ నమ్‌కీన్‌‌ను పరిచయం చేశారు. ఇది సంప్రదాయ నమ్‌కీన్‌‌లకు హెల్దీ ఆల్టర్నేటివ్.

10వేల కోట్ల బ్రాండ్‌గా..

50కి పైగా ఇన్వెస్టర్లు ఓపెన్ సీక్రెట్లో పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించారు. తన తల్లి సపోర్ట్‌తో ముందుకు సాగుతోంది. జీవితంలో గొప్పస్థాయికి ఎదగాలంటే చదువు.. ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని చిన్నప్పటి నుంచే వాళ్ల అమ్మ నేర్పిన సూత్రాలనే అహనా పాటిస్తూ వచ్చింది. ముఖ్యంగా పెళ్లి ప్రస్తావనలో చాలా సహకరించింది. ఏ తల్లి అయినా తన బిడ్డ పెళ్లి చేసేసి బరువు దించుకోవాలనే చూస్తుంది. కానీ అహనా వాళ్లమ్మ పెళ్లి కంటే కెరీర్ ముఖ్యమని చెప్పడంతోనే తన ఓపెన్ సీక్రెట్ కలను సాకారం చేసుకుంది. భవిష్యత్ లో దీనిని 10వేల కోట్ల బ్రాండ్‌గా మార్చాలనే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తోంది.

Read More..

జీవితం పరీక్ష పెట్టినా.. పరీక్షిత్ షా ఓడిపోలేదు.!

Next Story