Forest bathing : అడవికి వెళ్లి అలా చేస్తే చాలు.. ఒత్తిడి, ఆందోళన పరార్ !

by Javid Pasha |

Forest bathing : అడవికి వెళ్లి అలా చేస్తే చాలు.. ఒత్తిడి, ఆందోళన పరార్ !

Forest bathing : అడవికి వెళ్లి అలా చేస్తే చాలు.. ఒత్తిడి, ఆందోళన పరార్ !
X

దిశ, ఫీచర్స్ : ఒత్తిడి, ఆందోళనలు వేధిస్తున్నాయా? శారీరక అనారోగ్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే అడవికి వెళ్లి కొంత సమయం ప్రశాంతంగా గడపండి! అక్కడి జలాశయాల్లో స్నానం చేయండి అంటున్నారు నిపుణులు. ఇక థాయ్‌లాండ్‌ వైద్య నిపుణులైతే తమవద్దకు వచ్చే పేషెంట్లకు ఆరోగ్యరమైన అంశాల్లో భాగంగా ఫారెస్ట్ బాథింగ్ (Shinrin-yoku)ను కూడా సూచిస్తారట. ఎందుకలా? అటవీ స్నానం వల్ల కలిగే మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

*ఫారెస్ట్ బాతింగ్(Forest bathing) అనేది నిజానికి జపాన్‌లో ఉద్భవించిన అద్భుతమైన ప్రకృతి చికిత్సా పద్ధతి. నేచర్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల ఇది ఒత్తిడిని తగ్గించడంలో, ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో అద్భుతంగా పనిచేయడంవల్ల పలు ఇతర టూరిస్టు దేశాలు సైతం ఫారెస్ట్ బాతింగ్‌ను ప్రోత్సహించడం, వాటిని వ్యాపారంగా మల్చుకోవడం ప్రారంభించాయి. ముఖ్యంగా థాయ్‌లాండ్ ఫారెస్ట్ బాతింగ్‌ ఇప్పుడు వెల్‌నెస్ టూరిజంలో ఒక భాగమైపోయింది.

*ఫారెస్ట్ బాతింగ్ (Forest bathing) ప్రభావాన్ని తెలుసుకోవడానికి థాయ్ లాండ్‌కు చెందిన ప్రకృతి నిపుణులు 2024లో 30 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అటవీ స్నానం, ప్రకృతిలో గడపడం అధిక రక్తపోటును, హృదయ స్పందన రేటును తగ్గించడంలో సహాయపడిందని, మానసిక ఒత్తిళ్లను దూరం చేసిందని గుర్తించారు. దీంతో అక్కడి రిసార్టులు, నేషనల్ పార్కులు సైతం వెల్‌నెస్ టూరిజంలో భాగంగా ఫారెస్ట్ బాతింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

*అటవీ స్నానం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ఇది కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను తగ్గించడం వల్ల ఒత్తిడి ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి వంటి ససమ్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా అడవిలో ఉన్నప్పుడు అక్కడి చెట్లు విడుదల చేసే ఫైటోన్ సైడ్స్ సమ్మేళనాలను పీల్చడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీంతో శరీరంలో యాంటీ క్యాన్సర్ ప్రొటీన్లు, నాచురల్ కిల్లర్ కణాల సంఖ్య పెరుగుతుంది. ఫారెస్ట్ బాతింగ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను కూడా సగటున 6.6% తగ్గించినట్లు గత అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.

Next Story