- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: గాల్లో నిలబడే నివాసాలు.. భూకంపాల నుంచి రక్షించేందుకు జపాన్ కొత్త ప్రయోగాలు!
Viral News: అరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నావా? అంటూ హీరో సుహాస్ నటించిన కలర్ ఫొటో సినిమాలో ఓ సాంగ్ ఉంది.

దిశ, వెబ్ డెస్క్: Viral News: అరే ఆకాశంలోన ఇల్లే కడుతున్నావా? అంటూ హీరో సుహాస్ నటించిన కలర్ ఫొటో సినిమాలో ఓ సాంగ్ ఉంది. కానీ నిజ జీవితంలో నిజంగా ఆకాశంలో ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది? ఏ ఊరుకో ఆకాశంలో ఇల్లు ఏంటి కామెడీ కాకుంటే అనుకుంటున్నారా? ఇది నిజం. సరికొత్త ఆవిష్కరణకు పెట్టింది పేరైన జపాన్ ఇటీవల సరికొత్త రైలును పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా నడిచే ఈ రైలు భూకంపాలను పసిగడుతుందట. అందుకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుందట. అయితే తాజాగా భూకంపాల భారీ నుంచి రక్షించుకునేందుకు మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైంది.
మయన్మార్, థాయ్ లాండ్ వచ్చిన భూకంపం ఎలాంటి విధ్వంసాన్ని స్రుష్టించిందో తెలిసిందే. ఈ భూకంపాల నుంచి ఇళ్లను రక్షించుకునేందుకు జపాన్ ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. ఎయిర్ డాన్షిన్ అనే కంపెనీ భూకంప కార్యకలాపాల సమయంలో నిర్మాణాలను నేల నుంచి ఎత్తడానికి కంప్రెస్ట్ ఎయిర్ టెక్నాలజీని ఉపయోగించే లెవిటేటింగ్ ఇళ్లను డెవలప్ చేసింది.
సాధారణంగా ఈ ఇల్లు గాలి తీసిన ఎయిర్‌బ్యాగ్‌పై ఉంటుంది. కానీ భూకంపం వస్తుందన్న ఇండికేషన్ వచ్చిన వెంటనే.. వ్యవస్థ త్వరగా ఎయిర్‌బ్యాగ్‌ను పెంచి, ఇంటిని పైకి లేపి, వణుకుతున్న భూమికి ప్రత్యక్షంగా గురికాకుండా చేస్తుంది. ప్రకంపనలు తగ్గిన తర్వాత, ఇల్లు మెల్లగా దాని అసలు స్థానానికి తిరిగి వస్తుంది.
ఈ అత్యాధునిక సాంకేతికత ఇప్పటికే దాని ప్రభావాన్ని ప్రదర్శించింది. 2021లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో ఈ వ్యవస్థతో కూడిన ఇళ్ళు దెబ్బతినకుండా ఉన్నాయి. అదనంగా, జపాన్ భూ కదలికలు, అగ్నిపర్వత కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి సీస్మోమీటర్‌లను ఉపయోగిస్తుంది. భూకంప సంసిద్ధత, ప్రతిస్పందనను పెంచుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గాలిలో బెలూన్స్ ఎగిరేస్తే ఎలా ఉంటుందో..ఈ ఇండ్లు కూడా అలాగే ఎగురుతాయి. జపాన్ టెక్నాలజీకి నెటిజన్లు జై కొడుతున్నారు. ఇవి ఇళ్లనే ఎత్తుతున్నాయంటే..కార్లను కూడా ఎత్తుతాయి. భూకంపాలే కాదు వరదలు వచ్చినప్పుడు కూడా లిఫ్టింగ్ కూడా ఉపయోగపడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read More..
Viral Video: రోబోట్ డాగ్‌ను చూసి రియల్ డాగ్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?..వీడియో వైరల్






