- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: రోబోట్ డాగ్‌ను చూసి రియల్ డాగ్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?..వీడియో వైరల్
Viral Video: ఐఐటీ కాన్పూర్ క్యాంపస్ నుంచి రోబో కుక్కతో రియల్ కుక్కలు ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఐఐటీ కాన్పూర్ క్యాంపస్ నుంచి రోబో కుక్కతో రియల్ కుక్కలు ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
సాధారణంగా జంతు ప్రేమికులు ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. అవి కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అయితే వీటి స్థానంలో రోబోట్ కుక్కలు వస్తే ఎలా ఉంటుంది. అవును మీరు చదివిది నిజమే. ఐఐటీ కాన్పూర్ క్యాంపస్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియలో 3-4 కుక్కలు రోబో కుక్కలతో కలిసి ఆడుకుంటున్నాయి. ఈ రోబోట్ శునకాన్ని ఐఐటీ కాన్పూర్ కు చెందిన విద్యార్థులు తయారు చేశారు. ఈ వీడియోలో రోబో నిజమైన శునకం వలే నాలుగు కాళ్లపై నిలబడి ఉంది. సాధారణ కుక్క వలే దూకుతోంది. ఈ రోబోట్ శునకాన్ని చూసి అసలు కుక్కలు షాక్ అయ్యాయి. రోబోట్ శునకాన్ని చూడగానే అరవడం మొదలుపెట్టాయి. కొంత సమయం తర్వాత అది కూడా తమ ఫ్రెండ్ అనుకున్నాయోమే దానితో సరదాగా ఆడుకున్నాయి.
అయితే ఈ రోబోట్ కదలికలు సాధారణ కుక్కలా కనిపిస్తున్నాయి. కానీ దాని లోహపు శరీరం, తలలేని నిర్మాణం సాధారణ కుక్క కంటే కాస్త భిన్నంగా ఉంది. ఈ వీడియోను ఇండియన్ టెక్నాలజీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ @IndianTechGuide అకౌంట్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Read More..
India is making baby steps in robotics. pic.twitter.com/OJqt6SWYxJ
— Indian Tech & Infra (@IndianTechGuide) March 30, 2025






