Sea Cucumbers: పట్టుబడిన సముద్ర దోసకాయలు.. వాటి ధర, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు

by Vennela |   (  Updated:2025-04-01 06:01:38  IST  )

Sea Cucumbers: అవి మామూలు జీవులు కాదు. ఒక్కటి దొరికినా చాలు కోట్లలోనే సంపాదించవచ్చు.

Sea Cucumbers: పట్టుబడిన సముద్ర దోసకాయలు.. వాటి ధర, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు
X

దిశ, వెబ్ డెస్క్: Sea Cucumbers: అవి మామూలు జీవులు కాదు. ఒక్కటి దొరికినా చాలు కోట్లలోనే సంపాదించవచ్చు. అందుకే వాటిని అక్రమంగా రవాణా చేస్తుంటారు. అవే సముద్ర దోసకాయలు. ఇవి ప్రత్యేకమైన జీవులు. తాజాగా తమిళనాడులోని రామేశ్వరంలో 80లక్షల విలువ చేసే ఈ జీవులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సముద్ర దోసకాయల ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని దక్షిణ ఉచిపులి వద్ద సోమవారం భారత తీర రక్షక దళం రూ. 80 లక్షల విలువైన సముద్ర దోసకాయలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతం నుంచి అక్రమంగా సముద్ర దోసకాయలను తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతోనే నిఘా వర్గాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్రమ రవాణా నిరోధక అపరేషన్ ప్రారంభించింది. ఆ ప్రాంతంలో నిఘా పెంచేందుకు కోస్ట్ గార్డ్ వెంటనే ఎయిర్ కుషన్ వెహికల్ (ACV) H-197 ను పంపింది. ఈ ఆపరేషన్ సమయంలో, కోస్ట్ గార్డ్ బృందం దాదాపు 200 కిలోల బరువున్న సముద్ర దోసకాయలతో నిండిన ఐదు డ్రమ్ములను గుర్తించింది.

ఈ డ్రమ్ములలో సముద్ర దోసకాయలు ఉన్నాయి. వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని అంచనా. సముద్ర దోసకాయ ఒక సముద్ర జీవి. ఇది ప్రధానంగా సముద్రపు లోతుల్లో కనిపిస్తుంది. దీని ఆకారం స్థూపాకారంగా, మృదువుగా ఉంటుంది. దోసకాయను పోలి ఉంటుంది. అందుకే దీనిని 'సముద్ర దోసకాయ' అని పిలుస్తారు. దీనిని 'సముద్ర దోసకాయ' లేదా 'కక్డి' అని కూడా అంటారు. సముద్ర దోసకాయలు జల పర్యావరణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అవి సముద్రపు అడుగుభాగాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

సముద్ర దోసకాయ ప్రత్యేకత ఏమిటంటే దీనిని సాంప్రదాయకంగా చైనీస్.. దక్షిణాసియా వైద్య విధానాలలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తుంది. వీటిని తింటే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు దీనిని ఖరీదైన సముద్ర ఆహార వస్తువుగా కూడా వినియోగిస్తారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది.

ఈ సముద్ర దోసకాయలు భారతదేశంలో రక్షిత జాతుల జాబితాలో ఉంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం దీనిని పట్టుకోవడం, విక్రయించడం లేదా ఎగుమతి చేయడం చట్టవిరుద్ధం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా స్మగ్లర్లు వీటిని రహస్యంగా విదేశాలకు విక్రయిస్తున్నారు. అయితే ఈ సముద్ర దోసకాయలు తమిళనాడు తీర ప్రాంతాలతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనే కనిపిస్తాయి. కాగా ఇవి కిలోకు రూ. 30,000నుంచి రూ. 50,000 వరకు ఉండవచ్చని అంచనా.

Read More..

ఆసియాలోనే రిచెస్ట్ గ్రామం.. మన భారత్‌లోనే ఉందని తెలుసా..?

Next Story