Anxieties : అనవసర విషయాలపై ఫోకస్‌.. అధికమైతే రిస్క్!

by Javid Pasha |

Anxieties : అనవసర విషయాలపై ఫోకస్‌.. అధికమైతే రిస్క్!

Anxieties : అనవసర విషయాలపై ఫోకస్‌.. అధికమైతే రిస్క్!
X

దిశ, ఫీచర్స్ : మరో రెండ్రోజుల్లో ఎగ్జామ్ ఉందనుకోండి.. ఇలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు. పరీక్షలు దగ్గరపడుతున్నాయనే భయంతోనో, ఆందోళనతోనో చదువుపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా చేస్తారు. తాము చదువుకోవడం పక్కన పెట్టి, తమ స్నేహితులు, ఇతరులు ఎలా చదువుతున్నారోనని ఆలోచిస్తుంటారు. వీరు చదవరు కానీ అవతలి వారు చదువుతున్నందుకు ఆందోళన చెందుతారు. ఒక్క చదువు విషయంలోనే కాదు, జీవితంలోని అనేక సందర్భాల్లో ఇటీవలె ఇలాంటి ధోరణి పెరిగిపోతోందని మానసిక నిపుణులు అంటున్నారు. అంటే ఇక్కడ అనవసర విషయాలపై ఫోకస్ చేస్తూ మనసు పాడు చేసుకోవడం తప్ప ఎలాంటి లాభమూ ఉండదు. దీనినే డూమ్ సిచువేషన్స్‌గా పేర్కొంటున్నారు నిపుణులు.

ఇటీవల యువతరం మనసును అల్లకల్లోలం చేస్తున్న వ్యసనాల్లో ‘డూమ్ సిచువేషన్’ ధోరణి ఒకటి. అనవసర విషయాలపై ఫోకస్ చేసి, ఒత్తిడికి గురై, ఆందోళన చెందే లక్షణాలను లేదా రుగ్మతనే నిపుణులు ఇలా పిలుస్తున్నారు. అయితే ఇది ఏదో ఒక అంశానికి పరిమితమై ఉంటే సమస్య కాకపోవచ్చు. స్మార్ట్ ఫోన్ మొదలుకొని సోషల్ మీడియా, చదువుకునేచోటు, వర్క్‌ప్లేస్ ఇలా అనేక అంశాల్లోనూ కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అంటే విషయమేదైనా, సందర్భం మరేదైనా అది టెక్నాలజీ అయినా, నిజ జీవితంలో అయినా సంబంధంలేని వాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ మానసి అల్లకల్లోలాన్ని సృష్టించుకోవడమే ఈ ‘డూమ్ సిచువేషన్’ బాధితుల్లో కనిపించే ప్రధాన లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్‌లో నిమగ్నం అయ్యేవారు, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో స్ర్కోల్ చేసేవారు అదో లోకంలో మునిగిపోతారు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమంటూ ప్రారంభించి అందులోని రకరకాల కంటెంట్‌కు ప్రభావితం అవుతారు. తమకు ఆపాదించుకొని కొందరు, దానిగురించే ఆలోచిస్తూ ఇంకొందరు నిజజీవితంలో చేయాల్సిన పనులను, ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే అసలు సమస్య.

అనవసర విషయాలపై ఫోకస్ చేసి, వాటి గురించి ఆలోచిస్తూ తమగురించి ఆలోచించడం మానేసే ధోరణి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతన్నారు. ఎందుకంటే ఈ ‘డూమ్ సిచువేషన్’లో కోపం, ఆందోళన, ఒత్తిడి, గుండె దడ, శ్వాసలో ఇబ్బందులు వంటి సమస్యలు పెరిగిపోతాయి. ఇవి హార్మోన్ల విడుదలలో హెచ్చు తగ్గులు సంభవించేందుకు కారణం అవుతాయి. స్ట్రెస్ రిలేటెడ్ కార్టిసాల్ రిలీజై తద్వారా అధిక రక్తపోటు, గుండె జబ్బుల రిస్క్ వరకూ దారితీయవచ్చు. అందుకే అనవసర విషయాలపై ఫోకస్ చేస్తూ.. మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దు అంటున్నారు నిపుణులు.

Next Story