- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lungs: మీ ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి!
ఆరోగ్యంగా ఉండటం కోసం పోషకాహారాలను తీసుకోవాలి.

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యంగా ఉండటం కోసం పోషకాహారాలను తీసుకోవాలి. ప్రస్తుతం, చాలా మంది ఎవరి లైఫ్ లో వారు చాలా బిజీగా ఉన్నారు. కనీసం ఫుడ్ కూడా సరైన సమయానికి తీసుకోవడం లేదు. జంక్ ఫుడ్స్ కి అలవాటు పడి అనారోగ్యానికి గురవుతున్నారు. మనం ఎంత సంపాదించిన ఫుడ్ ని మాత్రమే తినగలం. అలాగే, హెల్త్ మంచిగా ఉంటేనే అన్ని పనులు చేయగలం. మనలో కొందరు ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడతారు. అలాంటి వారు ఈ ఆహారాలను తీసుకుంటే లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
వారంలో మూడు రోజులు కూరగాయలను తీసుకోవాలి. అలాగే, పండ్లని కూడా తింటూ ఉండాలి. ఇంకా ఆకు కూరల్లో పాలకూర, మెంతిని తినాలి. బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ రెండు రోజులకొకసారి తాగుతూ ఉండాలి. మసాలా ఫుడ్స్ ను తగ్గించాలి. వండుకునే కూరల్లో టమోటాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలు. అల్లం, పసుపు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, తులసి వంటి వాటిని కూడా మీ డైట్ లో చేర్చుకోవాలి. దీని వలన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
తక్కువగా నూనెని వాడాలి. అలాగే బాదం, వాల్‌నట్, పిస్తాలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. రాగి, మిల్లెట్లు, వోట్స్ వంటి తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు, పాలను తీసుకోవాలి. ఉసిరి, జామ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కొన్ని రోజులు చల్లని నీటిని తీసుకోకపోవడమే మంచిది. వేడి చేసిన నీటిని తాగుతూ ఉండాలి. అలాగే, ఫ్రై కర్రీస్ ను పూర్తిగా దూరం పెట్టాలి. భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడవాలి. అలాగే, లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం, మద్యపానాన్ని మానేయాలి. వీటిని పాటిస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంటాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Orange : ఈ పండు రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. ఆ సమస్యలన్నీ మాయం!






