Orange : ఈ పండు రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. ఆ సమస్యలన్నీ మాయం!

by Javid Pasha |   (  Updated:2025-03-04 07:28:03  IST  )

Orange : ఈ పండు రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. ఆ సమస్యలన్నీ మాయం!

Orange : ఈ పండు రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. ఆ సమస్యలన్నీ మాయం!
X

దిశ, ఫీచర్స్ : పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే కొన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ మరింత మేలు చేస్తాయని మీకు తెలుసా? అలాంటి వాటిలో ఆరెంజ్ ఒకటి. సమ్మర్ సీజన్‌లో వచ్చే ఈ ఫ్రూట్ పుల్లగా, తియ్యగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని పోషకాలు పలు రోగాలను సైతం తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దామా !

*ఆరెంజ్.. సంత్ర పండు అని కూడా పిలుస్తారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లల్లో ఇదొకటి. తినడంవల్ల బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడమే కాకుండా చర్మ రోగాల నివారణలో సహాయపడుతుంది. ఊబకాయంతో బాధపడేవారు దీనిని డైట్‌లో భాగంగా చేర్చుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

*జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చినప్పుడు సహజంగానే నోరు మొద్దుబారి పోతుంది. ఏం తిన్నా చేదుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆరెంజ్ మాత్రమే కాస్త టేస్టీగా అనిపిస్తుంది. తియ్యగా, పుల్లగా ఉంటుంది కాబట్టి తినాలనిపిస్తుంది. అంతేకాదు తినడంవల్ల ఇందులోని పోషకాలు జబ్బు, జలుబు, దగ్గు వంటివి తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సెడెంట్లు, ఇతర పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

* ఆరెంజ్ తినడానికే కాకుండా దాని తొక్క కూడా ఫేస్ ప్యాక్‌ కోసం వాడొచ్చు. ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సెడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్లో పెంచుతాయి. వేసవిలో పొడి చర్మం సమస్యను ఎదుర్కొనే వారుు ఆరెంజ్ తొక్కతో తయారు చేసిన ఫేస్‌ప్యాక్‌ను అప్లయ్ చేసి చల్లటి నీటితో కడుక్కుంటే మొహం నిగనిగలాడుతుంది.

*ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లకు నిలయం కాబట్టి, ఆరెంజ్‌ను తింటూ ఉంటే అధిక బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డైట్‌లో భాగంగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్, నేచురల్ ఎంజైమ్స్ ఎసిడిటీ, గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్‌ను దూరం చేస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Lungs: మీ ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి!

Next Story