రాంగ్ సైజ్ 'బ్రా' ఆరోగ్యానికి హానికరం.. కరెక్ట్ మెజర్‌మెంట్ ఎలా?

by Dishanational4 |
రాంగ్ సైజ్ బ్రా ఆరోగ్యానికి హానికరం.. కరెక్ట్ మెజర్‌మెంట్ ఎలా?
X

దిశ, ఫీచర్స్: ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు తాము ధరించే 'బ్రా' సైజు ఎంపికలో పొరపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది సేల్స్‌పర్సన్ సిఫార్సు చేసిన సైజుకే అడ్జస్ట్ అవుతారు. కానీ, కాలక్రమేణా శరీరాలు హెచ్చుతగ్గులకు గురవుతాయని గ్రహించరు. కాబట్టి బాడీకి సరిపడే లోదుస్తులను పొందుతున్నారని నిర్ధారించుకునేందుకు ప్రతిసారీ తనిఖీ చేయడం చాలా అవసరం. మంచి 'బ్రా' ధరించడం వల్ల పనిలో కంఫర్ట్‌నెస్, ఓ మంచి రాత్రితో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకోసం ఖచ్చితమైన బ్రా సైజ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం కాగా.. 'బ్రా' కొలతను సరైన మార్గంలో ఎలా కొలవాలో తెలుసుకుందాం.

బ్రా సైజును కొలవడం.. బ్యాండ్ సైజు, కప్ సైజుపై ఆధారపడి ఉంటుంది.

బ్యాండ్ సైజును ఎలా కొలవాలి?

* మీ వస్త్రాలను తీసివేసి నిటారుగా నిలబడి నాన్‌ప్యాడెడ్ బ్రా ధరించాలి.

* సాధారణంగా మీ బ్రా బ్యాండ్ కూర్చునే చోట, మీ వీపు చుట్టూ, బస్ట్ కింద కొలవడానికి మెజర్‌మెంట్ టేప్‌ ఉపయోగించాలి.

* టేప్ ఒక స్థిరమైన లైన్‌లో కదులుతున్నట్లు నిర్ధారించుకోవాలి. ఇది ఫ్రీగా ఉండాలి, బిగుతుగా ఉండకూడదు.

* కొలతను ఇంచెస్‌లో నమోదు చేసుకోవాలి. సరిసంఖ్య వస్తే సమస్యలేదు. బేసి సంఖ్య వస్తే మాత్రం దాన్ని సమీప సరిసంఖ్య వరకు చుట్టాలి.

* ఇప్పుడు మీ కప్ సైజును తెలుసుకోవాల్సి ఉంటుంది.

కప్ సైజును ఎలా కొలవాలి?

* మునుపటి 'బ్రా' ధరించి బస్ట్ పూర్తి భాగాన్ని కొలవాలి.

* కొలత మీ బస్ట్ అంతటా సమానంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు ఎప్పుడూ కొంత శ్వాస పీల్చుకుని మెజర్‌మెంట్ తీసుకోవాలి.

* తర్వాత మీ బస్ట్ కొలత నుంచి బ్యాండ్ సైజును తీసివేయాలి. అక్షరం రూపంలో మీ కప్ పరిమాణంలో తేడా వస్తుంది

* ఇప్పుడు మీ కప్ సైజు నుంచి మీ బ్యాండ్ సైజును తీసేయాలి. తేడా అనేది మీ కప్ సైజును తెలియజేస్తుంది. మీ కప్ సైజు 36 ఇంచెస్, బ్యాండ్ సైజు 34 ఇంచెస్ ఉంటే 2 ఇంచులు పొందుతారు. అంటే అది B కప్ సైజు. మీ సరైన బ్రా సైజు 36B.

సరైన బ్రా సైజ్ ధరించడం వల్ల ఉపయోగాలు :

* సరైన సైజు 'బ్రా' ధరిస్తే నాజూకుగా కనిపిస్తారు. ఇది శరీరానికి పరిపూర్ణమైన అవుట్‌లైన్‌ను ఇస్తుంది. తద్వారా మీరు స్పష్టమైన శారీరక సౌష్టవంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెద్ద చాతి ఉన్న మహిళలు తగినంత లిఫ్ట్, సైడ్ సపోర్ట్‌తో సరైన బ్రాను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

* పర్‌ఫెక్ట్ సైజు 'బ్రా' వక్షస్థలాన్ని ఆకృతి చేయడంలో సాయపడుతుంది. మీరు ధరించే అన్ని రకాల ఔట్‌వేర్స్‌లో కంఫర్ట్‌గా ఉంటారు.

* కంఫర్ట్‌నెస్, అప్పియరెన్స్‌ను మెరుగుపరచడమే కాకుండా రాంగ్ సైజు దుస్తులు ధరించడంతో తలెత్తే భుజం లేదా మెడ ఒత్తిడిని తగ్గించడానికి సాయపడుతుంది.

* మంచి ఫిట్టింగ్స్ కలిగిన 'బ్రా'.. రొమ్ములకు దిగువ నుంచి లిఫ్ట్ ఇవ్వడం ద్వారా కుంగిపోకుండా చేస్తుంది. నరాలు, మెడ కణజాలాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి : Porn Videos చూస్తున్నారా? ఈ హెచ్చరిక మీ కోసమే.



Next Story

Most Viewed