Porn Videos చూస్తున్నారా? ఈ హెచ్చరిక మీ కోసమే..

by Disha Web Desk 22 |
Porn Videos చూస్తున్నారా? ఈ హెచ్చరిక మీ కోసమే..
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి యుగంలో మొబైల్ ఫోన్ యూజ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మనుషులతో సరదాగా ఆడుతూ, పాడుతూ తిరిగే రోజులు పోయి.. మొబైల్‌ మైకంలో గంటల గంటలు గడుపుతున్నారు. ఒకరకంగా మొబైల్స్ లేకపోతే ప్రజల అవసరాలు తీరడం కష్టమైన పరిస్థితికి వచ్చింది. అయితే ఎక్కడో జరిగిన టీవీ సీరియల్స్, క్రికెట్ మ్యాచెస్, వీడియోస్, అందమైన ఫొటోలను చూసేందుకు ఈ మొబైల్ యూజ్ అవగా.. మరికొందరికి మాత్రం బ్యాడ్ కంటెంట్‌ చూడటానికి ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా పోర్న్ కంటెంట్లు.

అయితే ఈ పోర్స్ వెబ్‌సైట్లను ఇండియాలో నిషేదించినా.. కొందరు మాత్రం వీటిని చాలా రహస్యంగా చూస్తున్నారు. అయితే ఇలా రహస్యంగా పోర్న్ వీడియోలు చూడటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అవునండీ నిజమే అది ఎలా అనుకుంటున్నారా? రహస్యంగా పోర్న్ వెబ్‌సైట్లు చూసే క్రమంలో ఫోన్‌కు సంబంధించిన ప్రైవేట్ మోడ్‌ ఆన్ అవుతుంది. తద్వారా ఏఐ(AI)బాట్‌లు అటువంటి వీడియోలు చూసే వారిపై నిఘా ఉంచుతారని మీకు తెలుసా? తెలియకపోతే వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..

* సాధారణంగా కొందరు వ్యక్తులు రహస్యంగా తెలియని పోర్న్‌ వెబ్‌సైట్లు ఓపెన్ చేసినపుడు, వాటితో పాటుగా కొన్ని ఫైల్స్ డౌన్‌లోడ్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు ఆ ఫైళ్లతో పాటుగా మాల్వేర్ వైర్‌స్ కూడా డౌన్‌లోడ్ అయిపోతుంది. తద్వారా ఫోన్‌లో ఉండే డేటా, ఫొటోలు, వీడియోలను రహస్యంగా దొంగిలించబడుతుంది. వీటి గురించి తెలియక కొందరు బ్లాక్‌మెయిల్‌కు గురవుతున్నారు.

* ఇక మొబైల్‌లో అడల్డ్ కంటెంట్ చూసేవారిపై ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు కూడా నిఘా పెడతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

* కొందరు సెలబ్రెటీలు, పెద్దపెద్ద వ్యక్తుల అడల్ట్ వీడియోలు చూసేందుకు ఆన్‌లైన్‌లో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. ఆ సమయంలో వీడియో మాత్రమే చూస్తున్నాం అని అనుకుంటారు. కానీ, అడల్ట్ కంటెంట్‌ అందించే వ్యక్తి మీ ఫోన్‌లో మాల్వేర్‌ వైరస్‌ను పంపి డేటా మొత్తాన్ని దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

సెక్స్ తర్వాత ఇంటిమేట్ ఏరియా క్లీనింగ్.. ఎందుకంత ముఖ్యం?


Next Story

Most Viewed