Hormonal Balance: హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌‌కు చెక్ పెట్టే ‘క్రూసిఫెరస్’

by Phanindra |   (  Updated:2023-03-08 09:52:48  IST  )

ఉరుకుల పరుగుల జీవితం, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి కారణాలేమైనా ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఒకటి.

Hormonal Balance: హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌‌కు చెక్ పెట్టే ‘క్రూసిఫెరస్’
X

దిశ, ఫీచర్స్: ఉరుకుల పరుగుల జీవితం, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి కారణాలేమైనా ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఒకటి. దీనివల్ల ఇటీవలి కాలంలో థైరాయిడ్, పీసీఓడీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అధికం అవుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేగాక వివిధ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. మూడ్‌స్వింగ్స్‌, జుట్టు విపరీతంగా రాలిపోవడం, అలసట, చర్మ సంబంధ వ్యాధులు కూడా హర్మోన్ల లోపం లేదా ఇన్ బ్యాలెన్స్ వల్ల వస్తాయి. ‘క్రూసిఫెరస్’ రకానికి చెందిన కూరగాయలు తినడంవల్ల హార్మనల్ ఇన్ బ్యాలెన్స్‌కు క్రమంగా చెక్ పెట్టువచ్చని ఆహార నిపుణులు చెప్తున్నారు. క్యాబేజీ రకానికి చెందిన, ఆ తరహా కూరగాయలనే ‘క్రూసిఫెరస్’ అంటారు. బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ర్పౌట్స్, బచ్చలికూర, క్యాబేజీ ఉంటాయి. క్రూసిఫెరస్ కూరగాయల కోవకు చెందినవే.

విటమిన్లు, హర్మోన్లు

క్రూసిఫెరస్ కూరగాయల్లో గ్లూకోసినోలేట్స్ ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కెరోటినాయిడ్స్ (బీటా-కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్), విటమిన్‌ సి, ఇ, కె, మినరల్స్‌ కూడా మెండుగా ఉంటాయి. పైగా క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండుగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్రూసిఫెరస్ కూరగాయల్లోని డైండోలిల్మెథేన్ అనే సమ్మేళనం శరీరంలో అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. హర్మోన్లను బ్యాలెన్స్‌డ్డ్‌గా ఉంచుతుంది. లివర్ ఫంక్షనింగ్ సక్రమంగా జరుగుతుంది. క్రూసిఫెరస్ కూరగాయల్లో థియోసైనేట్‌లు ఉంటాయి కాబట్టి ఇవి అయోడిన్ శోషణను నిరోధిస్తాయి. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు క్రూసిఫెరస్‌ కూరగాయలు ఎక్కువగా తినకూడదని, తీసుకోవాల్సి వస్తే పచ్చివిగా అస్సలు తీసుకోకూడదని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఉడికించిన వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చని చెప్తున్నారు.

Read more:

రాస్ బెర్రీస్ రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?

జ్వరం త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి..

Next Story