రాస్ బెర్రీస్ రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?

by Kema Shiva Kumar |   (  Updated:2023-03-08 09:52:11  IST  )

ఆరోగ్యం అన్ని విధాలా మెరుగ్గా ఉండాలంటే మంచి జీవనశైలి అలవాట్లతో పాటుగా మనం తినే ఆహారం కూడా ఆరోగ్యకరమైందిగా ఉండాలి.

రాస్ బెర్రీస్ రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యం అన్ని విధాలా మెరుగ్గా ఉండాలంటే మంచి జీవనశైలి అలవాట్లతో పాటుగా మనం తినే ఆహారం కూడా ఆరోగ్యకరమైందిగా ఉండాలి.ముఖ్యంగా సమతుల్య ఆహారంతో పాటుగా పండ్లను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్ బెర్రీలు లేదా కోరిందకాయలు తీయగా ఉంటాయి. ఈ పండ్లు ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ కోరిందకాయలు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇవి దొహదపడుతాయి.

అదేవిధంగా గుండె ఆరోగ్యంగా పనిచేయడంలో, బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. కోరిందకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అందులోని విటమిన్ 'సి', విటమిన్ 'ఇ' లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రాస్ బెర్రీ క్యాన్సర్ ను నివారించడానికి ఉత్తమమైన పండుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కోరిందకాయలలో కనిపించే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ ను కలిగించే కణాలను తొలగిస్తాయి. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : Hormonal Balance: హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌‌కు చెక్ పెట్టే ‘క్రూసిఫెరస్’

Next Story