- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ రోజుల్లోనే అధిక అలసట.. గుండె దడ దడ! ఎందుకిలా?
పండుగ సెలవులను బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు కొందరు. కానీ.. చివరికి గుండె దడ మొదలవుతుంది. ఏదో ఒక అనారోగ్యంతో నిరాశకు గురవుతుంటారు. ఎందుకో తెలుసా?

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా? ప్రతి రోజూ హుషారుగా కనబడే కొందరు పండుగ రోజుల్లో సిక్ అవుతుంటారు. ఉద్యోగాలకు, వివిధ పనులకు వెళ్లినా అలసిపోని వారు కూడా హాలిడేస్‌లలో డల్ అయిపోతుంటారు. సెలవులను ఎంతో ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ.. చివరికి గుండె దడ మొదలవుతుంది. ఏదో ఒక అనారోగ్యంతో నిరాశకు గురవుతుంటారు. ఇలా సెలవు రోజుల్లో మాత్రమే తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటిని ‘హాలిడే హార్ట్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకని ఇలా..?
హాలిడే హార్ట్ సిండ్రోమ్‌ను చిన్న రుగ్మతగా భావిస్తుంటారు చాలా మంది. నిజమే కానీ.. మరీ నిర్లక్ష్యం చేస్తే కొన్సిసార్లు అది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యగానూ మారవచ్చు. తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ కూడా అవసరం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక హాలిడే లేదా పండుగ రోజుల్లోనే ఇది ఎందుకని ఎక్కువగా వస్తుందంటే.. ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఏంటంటే.. చాలామంది సెలవులు, పండుగలు, పంక్షన్లు, వివిధ ప్రత్యేక సందర్భాల్లోనే ఆల్కహాల్, వివిధ పానీయాలు ఎక్కువగా తాగడం, రకరకా ఆహారాలు, స్వీట్స్ వంటివి తినడం చేస్తుంటారు. ఈ పరిస్థితి గుండె వేగంగా కొట్టుకోవడానికి దారితీస్తుంది. అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి ఆ సందర్భంలో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వచ్చే అవకాశాన్ని మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఏం జరుగుతుంది? ఏం చేయాలి?
పండుగ రోజుల్లో లేదా సెలవు రోజు తీసుకునే ఆల్కహాల్, ఇతర పానీయాలు, ఆహారాల వల్ల అందరూ గుండెకు సంబంధించి ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటారని కూడా చెప్పలేం. కొందరికి హార్ట్ బర్న్, కడుపులో ఉబ్బరం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. మధుమేహం ఉన్నవారికి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగి, బ్లడ్ ప్రెజర్ అధికమై ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఆహారాలు సరిపడక కొందరు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతుంటారు. ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గుండెపై ప్రభావం చూపుతుండటం కారణంగా వైద్య నిపుణులు ఆ సందర్భంలో ఏర్పడే సమస్యలను ‘హాలిడే హార్ట్ సిండ్రోమ్’గా పేర్కొంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సెలవు రోజుల్లో, పండుగ రోజుల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మెయింటైన్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండెపై ప్రతికూల ప్రభావం చూపే మద్యపానం, అధిక చక్కెర స్థాయిలు కలిగి ఉండే ఇతర పానీయాలు, స్వీట్లు, జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.






