- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు పదుల వయసులోనే ముంచుకొస్తున్న ఊబకాయం..! కారణమిదే..
ఐదారేండ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 57% మంది అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 47% మంది అధిక బరువు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని భావిస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : ఊబకాయం(Obesity).. ఒకప్పుడు ఈ సమస్య చాలా తక్కువ మందిలో కనిపించేది. 40 ఏండ్లు దాటినవారిలోనే అధికంగా ఉండేది. కానీ ఇటీవల రోజు రోజుకూ పెరుగుతోందని, అది కూడా 30 ఏండ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తోందని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. పలు ఇతర కూడా ఇదే పేర్కొన్నాయి. మూడు పదుల వయసులోనే ఊబకాయం లేదా అధిక బరువు పెరగడానికి నిశ్చల జీవనశైలితోపాటు అధిక మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని పేర్కొన్నది.
ఐదారేండ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 57% మంది ప్రజలు, ముఖ్యంగా యువత అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇందులో 47 శాతానికిపైగా తాము మెంటల్‌స్ట్రెస్ కారణంగానే అధిక బరువు పెరుగుతున్నామని భావిస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక అధిక ఒత్తిడికి గల కారణాలను విశ్లేషించిన నిపుణులు.. ప్రతీ 10 మందిలో 4 ఇనాక్టివ్ సిట్టింగ్, ఓవర్ థింకింగ్ వల్ల అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నట్లు గుర్తించారు. మరో 30% మంది భోజనం సమయానికి తినకపోవడం, సరైన పోషకాలు అందకపోవడం కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఆయా సందర్భాల్లో పలువురు ఎదుర్కొంటున్న మెంటల్ స్ట్రెస్, వారి సామాజిక జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. 44% మందిలో వర్క్ అండ్ లైఫ్‌పై ప్రభావం చూపుతోంది. అలాగే డబ్బు సంపాదించే క్రమంలో 36% మంది, ఉద్యోగాలు చేసేచోట 34% మంది తరచుగా స్ట్రెస్‌కు గురవుతున్నారు.
అధిక ఒత్తిడితో అధిక బరువు పెరుగుతున్నామని భావిస్తున్న ప్రతీ నలుగురిలో ఒకరు దాని నుంచి బయటపడతామా లేదా అని కూడా నిరంతరం ఆందోళన చెందుతున్నారు. 46% మంది ఒత్తిడి కారణంగా నిద్రను, 37% మంది ఏకాగ్రతను కోల్పోతున్నారు. 30 % మందిలో ప్రెజర్ పెరుగుతుండగా, ప్రతీ 10 మందిలో 4 క్రానిక్ స్ట్రెస్‌ను అనుభవిస్తున్నారు. దీంతోపాటు ఒత్తిడివల్ల చాలా మంది సాధారణంకంటే 5 నుంచి 7 కిలలో బరువు పెరుగుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఒత్తిడిని తగ్గించుకోవాలని, ఒత్తిడి రహిత దిన చర్యలను, ఆహారపు అలవాట్లను, జీవన శైలిని అలవర్చుకోవాలని, తరచుగా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.






