నిద్రలేవగానే మానసిక గందరగోళం.. రోజంతా నిరాశ..! ఇలా ఎందుకు జరుగుతుంది?

by Javid Pasha |   (  Updated:2025-12-26 06:37:22  IST  )

తినే ఆహారంలో మెగ్నీషియం లోపించడం కూడా బ్యాడ్ మూడ్ స్లీప్‌కు కారణం అవుతుంది. కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. మెగ్నీషియం లెవల్స్ గురించి ఎక్కువగా ఆలోచించరు.

నిద్రలేవగానే మానసిక గందరగోళం.. రోజంతా నిరాశ..! ఇలా ఎందుకు జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్ : పొద్దు పొద్దున్న బ్యాడ్ మూడ్‌తో నిద్రలేస్తున్నారా? ఏదో తెలియని నిరాశ, నిస్పృహ, మానసిక ఆందోళన, గందరగోళం వెంటాడుతున్నాయా?.. ఇలాంటి సమస్యకు కారణం మీరే కావచ్చునేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే.. ముందురోజు రాత్రి నిద్రకు ముందు మీరు తీసుకునే ఆహారం, పానీయాలు, అలాగే అతి ఆలోచనలు మరుసటిరోజు మిమ్మల్ని బ్యాడ్ మూడ్‌తో మేల్కొనేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ఇటీవల అనేకమంది ఎదుర్కొంటున్న రొటీన్ ప్రాబ్లమ్ ఇది. నిద్ర మేల్కొన్నప్పటికీ ముఖంలో కోపం, ఆవేదన, స్ట్రెస్ వంటి ఏదో ఒక లక్షణం కనిపిస్తుంది. ఇలా అప్పుడప్పుడైతే పర్లేదు కానీ.. తరచూ అదే జరుగుతుంటే మాత్రం మీ ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాకుండా రోజువారి పనికి, వృత్తి జీవితానికి ఆటంకం కలుగుతుంది. అయితే అందుకు కారణాలేమిటి? బయటపడటానికి నిపుణులు సూచిస్తున్న సలహాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సరైన ఆహారం తీసుకోకపోవడం

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సరైన భోజనం తీసుకోకపోవడం మరుసటి రోజు ఉదయం మీరు బ్యాడ్‌గా నిద్రమేల్కొనేలా చేస్తుంది. కొందరికి రాత్రి భోజనం తర్వాత స్వీట్లు, చిప్స్, ఇతర చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడాన్ని ఇంట్లో వాళ్లు వ్యతిరేకిస్తారనే కారణంతో కొందరు ఎలాగైనా తినాలని సాకులు వెతుకుతుంటారు. తాము తిని చాలా రోజులైందని, కాబట్టి ఇప్పుడు తింటే ఏం కాదని చెప్తుంటారు. కొందరు అలా తినడంవల్ల తమ బాధలు పోతాయని, రిలాక్స్ అవుతామని అంటుంటారు. కానీ ఇది నిజం కాదు. రాత్రిళ్లు భోజనం తర్వాత అదనంగా ఆహారం, స్వీట్లు, చిప్స్, పిస్తా, పిజ్జా వంటివి తీసుకో కూడదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవి అధిక మోతాదులో కార్బోహైడ్రేట్లు కలిగిన ఇతర ఆహారాలు. పడుకునే ముందు తినడంవల్ల నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. కానీ మరుసటిరోజు మీ మూడ్ పాడు చేస్తాయి. కోపంతో మేల్కొనేలా చేస్తాయి. న్యూట్రిషనల్ థెరపిస్ట్ జాకీ లించ్ ప్రకారం.. ఇలాంటి ఆహారాలు మీ రక్తంలో షుగర్ లెవల్స్‌ను హెచ్చుతగ్గులకు గురిచేస్తాయి. ఫైనల్‌గా నిద్రపోయే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే నిద్ర పోయేకంటే ముందు కనీసం 3 నుంచి 4 గంటల ముందు తింటే అంత ప్రభావం ఉండకపోవచ్చు.

2. మెగ్నీషియం లోపించడం

తినే ఆహారంలో మెగ్నీషియం లోపించడం కూడా బ్యాడ్ మూడ్ స్లీప్‌కు కారణం అవుతుంది. కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. మెగ్నీషియం లెవల్స్ గురించి ఎక్కువగా ఆలోచించరు. మీ దిన చర్య ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి తగిన మెగ్నీషయం అవసరం అని పరిశోధనలు చెప్తున్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారం ద్వారా ఇది లభిస్తుంది. అందుకే మీరు తింటున్న ఆహారంలో మెగ్నీషియం సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అందుకు ఒక మార్గం ఉంది. అదేంటంటే.. మీ డిన్నర్‌‌లో కొన్ని ముదురు రంగు కూరగాయలను(dark-colored vegetables) చేర్చడం. మెగ్నీషియం తగిన సాంద్రతలో మెయింటెన్ చేయడానికి ఇది చాలా అవసరం. ఇలా చేయకపోతే మీరు సాధారణంగా మానసిక, శారీరక ఒత్తిడి ఒత్తిళ్లకు లోనవుతారు. ఇటువంటి స్ట్రెస్ మూలంగాను మెగ్నీషయం మరింత కోల్పోతారు. దీనివల్ల మీ ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఎందుకంటే.. బిహేవియర్‌ను కంట్రోల్ చేయగలిగే సామర్థ్యాన్ని మెగ్నీషియం కలిగి ఉంటుంది. మెగ్నీషియం పొందడానికి మరొక మార్గం కూడా ఉంది. అదే ఎప్సన్ ఉప్పుతో(Epson salt. ) స్నానం చేయడం. పడుకునే ముందు ఎటువంటి ఆహారాలు తినకుండానే మీ శరీరంలోకి మరింత మెగ్నీషియం పొందడానికి ఇది మరింత రిలాక్సింగ్ వే అని చెప్పొచ్చు.

3. ఆల్కహాల్ సేవించడం

చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్‌ను కలుసుకునే రాత్రులు ఊహించని విధంగా ఉంటాయి. కొందరు మందుపార్టీలు చేసుకుంటారు. ఎక్కువగా తాగుతారు. నిద్రకుముందు ఇలా మద్యం సేవించడం మరుసటిరోజు నిద్ర మేల్కోవడంపై, అలాగే మీ పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. టూ మచ్ ఆల్కహాల్ (ముఖ్యంగా రాత్రిపూట) మీ లివర్‌పై చాలా స్ట్రెస్‌ను పెంచుతుంది. మానవ భావోద్వేగాలపై కాలేయం పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మీకు నిరాశ కలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఆ పరిస్థితి మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ మీరు ఊహించని రీతోలో మీలో మానసిక ఆందోళన పెంచుతుంది. భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎక్కువగా తాగాలని అనిపించినప్పుడు ఒక్కసారి మీ లివర్ హెల్త్‌ గురించి ఆలోచించండి. తక్కువ హ్యాంగోవర్‌తో మేల్కొలపడానికి తక్షణ పరిష్కారం ఏంటంటే.. పడుకునే ముందు కొంచెం విటమిన్ సి కూడా తీసుకోవడం. మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరాన్ని నిర్విషీకరణ(detoxify) చేసే బాధ్యత కూడా కాలేయానికి ఉంటుంది. ఎక్కువ తాగడం వల్ల అలా జరగకపోవచ్చు.

4. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం

మీరు బ్యాడ్ మూడ్‌లో మేల్కొన్నప్పుడు, ఆ కోపాన్ని మీ కడుపుపై చూపొద్దు. అంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా ఉండకండి. మీరు ఏ విధమైన ఆహారం తీసుకున్నా సరే.. బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం. మూడ్ బాగోలేదని దానిని స్కిప్ చేస్తుంటే గనుక మీరు నిరాశ, ఆందోళనలను ఆహ్వానించినట్టే లెక్క. లైట్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తక్షణమే మీ రోజువారి మానసిక స్థితిని ఆనందమయం చేస్తుంది. మీకు కోపంగా అనిపించినప్పుడు ఎందుకలా అనిపిస్తుందనేది నిర్ధారించుకోండి. కొంచెం అల్పాహారం తినండి, ఆ తర్వాత ఎలా అనిపిస్తుందో చూడండి. తినకుండా ఉండటం అనేది మరుసటిరోజు మీ మూడ్ పాడవడానికి కారణం అవుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ట్రై చేసినవారు ఆరోజంతా చాలా మంచి అనుభూతి చెందుతారు. బోనస్ చిట్కా ఏటంటే.. మీరు తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌లో తగిన ప్రోటీన్‌ను కలిగి ఉండటం. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి, ఎనర్జీ కోసం సహాయపడుతుంది.

5. రొటీన్‌కు భిన్నంగా

మీరెప్పుడైనా నిద్రలేని రాత్రులు గడిపారా? ఎలాగైనా నిద్రపోవాలని ప్రయత్నంలో భాగంగా కళ్లు మూసుకుంటారు. కానీ కునుకు రాదు. రకరకాల ఆలోచనలు వెంటాడుతుంటాయి. అయితే ఎందుకు అలా జరుగుతుందో మాత్రం చాలామంది పట్టించుకోరు. మీరు మరుసటి రోజు బ్యాడ్ మూడ్‌తో నిద్ర మేల్కొనడానికి ఇది కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. పడుకునే ముందు రోటీన్‌కు భిన్నమైన జీవనశైలి, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం, ఫోన్‌లో నిమగ్నమైపోవడం, జంక్ లేదా ఆయిలీ ఫుడ్స్ తినడం వంటి కారణాలతో ఇటువంటి సమస్య తలెత్తుతుంది. కాబట్టి వాటిని నివారించాలి. నిద్రపోయే సమయాన్ని ఆందోళన కరంగా ఉండకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.

Read More..

చలికాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు.. ఇలాంటి వారిలోనే అధికం!

Next Story