జుట్టు రాలుతోందా? ఆగిపోవాలంటే మీరు చేయాల్సింది ఇదే!

by Javid Pasha |   (  Updated:2026-04-24 10:35:06  IST  )

కేవలం నూనెలు, షాంపూలు వాడటమే కాదు.గ్రోత్ సర్కిల్, కెరాటిన్ ఉత్పత్తి, విటమిన్లు, మినరల్స్ కూడా జుట్టు ఆరోగ్యంలో కీ రోల్ పోషిస్తాయి.

జుట్టు రాలుతోందా? ఆగిపోవాలంటే మీరు చేయాల్సింది ఇదే!
X

దిశ, ఫీచర్స్ : జుట్టు రాలడం లేదా పల్చబడటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఇందుకు పరిష్కారం కేవలం నూనెలు, షాంపూలు వాడటంలో మాత్రమే లేదంటున్నారు నిపుణులు. జుట్టు మూలాలైన ఫోలికల్స్, స్కాల్ప్‌కు అంతర్గతంగా సరైన పోషకాలు అవసరమని చెబుతున్నారు. గ్రోత్ సర్కిల్, కెరాటిన్ ఉత్పత్తి, విటమిన్లు, మినరల్స్ కూడా జుట్టు ఆరోగ్యంలో కీ రోల్ పోషిస్తాయి. అంటే బాహ్య సంరక్షణతోపాటు శరీరం లోపలి పోషణ లేకపోతే జుట్టు సమస్యలు పూర్తిగా తగ్గవని, అందుకోసం కొన్ని ముఖ్యమైన పోషకాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

1. బయోటిన్ (విటమిన్ B7) : ఇది కెరాటిన్ ఉత్పత్తిని పెంచి జుట్టును బలపరుస్తుంది. ఇందుకోసం గుడ్డు పచ్చసొన, బాదం, వాల్‌నట్స్, చిలగడ దుంప, అవకాడో, పాలకూర, సాల్మన్ చేప, పుట్టగొడుగులు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

2. విటమిన్ డి : జుట్టు ఫోలికల్స్‌ను యాక్టివేట్ చేసి పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి డైలీ ఉదయంపూట 15 నుంచి 20 నిమిషాలు ఎండలో నిలబడాలి. ఇక ఆహారాల విషయానికి వస్తే కొవ్వు చేపలైన సాల్మన్, మారెకల్, ట్యూనా వంటివి తినాలి. గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, ఫోర్టిఫైడ్ పాలు, పెరుగు వంటివి రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి.

3.ఐరన్ : శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి హెమోగ్లోబిన్12+ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం మటన్ లివర్, చికెన్, పాలకూర, బీట్‌రూట్, ఖర్జూరం, నల్ల నవ్వులు, బెల్లం, రాగులు, బీన్స్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

4. జింక్ : ఇది జుట్టు కణజాలాలను రిపేర్ చేసి పెరుగుదలను మెరుగు పరుస్తుంది. ఇందుకోసం గుమ్మడి గింజలు, జీడిపప్పు, శనగలు, పల్లీలు, రొయ్యలు, పీతలు, గుడ్డు, పెరుగు, శెనగపప్పు వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. అయితే జింక్ మరీ ఎక్కువైనా జుట్టు రాలుతుంది కాబట్టి జాగ్రత్త పడాలి.

5. విటమిన్ సి : ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ఐరన్ శోషణను మెరుగు పరుస్తుంది. కాబట్టి అది లభించే ఉసిరి, జామకాయ, నిమ్మకాయ, నారింజ, క్యాప్సికం, బ్రోకలీ, టమాటా, బొప్పాయి వంటివి తింటూ ఉండాలి. ఒక్క ఉసిరి కాయలో ఒక నారింజకన్నా 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఉసిరి కాయను తప్పక తినాలి.

6. విటమిన్ ఇ : ఇది కూడా స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచి జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫోలికల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇది లభించాలంటే.. బాదం, పొద్దు తిరుగుడు గింజలు, అవకాడో, పాలకూర, వేరుశెనగ నూనె, ఆలివ్ ఆయిల్ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

7. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ : ఇవి జుట్టును పోషణలో కీ రోల్ పోషిస్తాయి. వారానికి కాబట్టి అవి లభించాలంటే.. రెండుసార్లు చేపలు తినడం ఉత్తమం. ముఖ్యంగా సాల్మన్, సార్డిన్ చేపలు తినాలి. ఇక అవిసెగింజలు, చియా సీడ్స్, వాల్‌నట్స్, సోయాబీన్స్ వంటివి తింటూ ఉంటూ ఉండాలి. ఈ పోషకాలన్నీ సహజమైన ఆహారాల ద్వారా లభిస్తేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

మునగలో పోషకాలు ఫుల్.. తినడంవల్ల కలిగే ప్రయోజనాలివే..

Next Story