మునగలో పోషకాలు ఫుల్.. తినడంవల్ల కలిగే ప్రయోజనాలివే..

by Javid Pasha |   (  Updated:2026-04-23 13:32:33  IST  )

మొరింగా ఆకుల్లో, కాయల్లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సహా పలు ఇతర పోషకాలు ఉంటాయి. బీపీ నియంత్రణలో సహాయపడతాయి.

మునగలో పోషకాలు ఫుల్.. తినడంవల్ల కలిగే ప్రయోజనాలివే..
X

దిశ, ఫీచర్స్ : ఎముకల బలహీనత వేధిస్తోందా? బీపీ కంట్రోల్లో ఉండట్లేదా? అయితే మునగ కాయలు లేదా ఆకులను ఆహారంలో భాగంగా తీసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే వీటిలోని పోషకాలు ఆ సమస్యలను దూరం చేసే అవకాశం ఎక్కువ. దీంతోపాటు ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంలో మునగ కాయలు, ఆకులు అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మునక్కాయ(moringa)ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కూరగాయల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇది అధిక పోషకాలను కలిగి ఉంటుంది. మొరింగా ఆకులు, కాయల్లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎండిన మునగాకుల పొడిలో కాల్షియం పాలకంటే 4 రెట్లు ఎక్కువగా, పొటాషియం అరటికంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతారు. మాంసం కంటే రెట్టింపు ప్రొటీన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ ఎముకల బలాన్ని, శరీరంలో శక్తి స్థాయిలను, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్త పోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మునగలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను, శరీరంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

మునక్కాయలో, ఆకుల్లో కూడా విటమిన్ ఎ, సి, బి6, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మం, జుట్టు, శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఎముకలు, దంతాల బలానికి సహాయపడతాయి. కొలాజెన్ ఉత్పప్తిని పెంచుతాయి. ఐరన్‌ను శరీరం గ్రహించేలా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. మునగలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతోపాటు మునక్కాయ లేదా ఆకులను ఆహారంలో భాగంగా వండి తినడం వల్ల ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

థైరాయిడ్‌ అసమతుల్యత.. ఈ అలవాట్లతో పరార్!

Next Story