- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిగుళ్ల నొప్పితో బాధపడుతన్నారా? లవంగం నూనెతో క్షణాల్లో పరార్ !
లవంగం నూనెను చిగుళ్లపై రాయడంవల్ల ఇన్‌ఫ్లమేషన్ రక్త ప్రవాహంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. చిగుళ్ల మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

దిశ, ఫీచర్స్ : చిగుళ్ల నొప్పితో బాధపడుతున్నారా? నోటిలో మొదలై శరీరమంతా వ్యాపించే వాపు(Inflammation)తో అవస్థలు పడుతున్నారా? అయితే పెద్దగా ఖర్చులేని ఒక చక్కటి చిట్కాతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. అదే లవంగం నూనె. దీనిని రాత్రిపూట చిగుళ్లపై రాయడంవల్ల లోపల దాగి ఉన్న హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. కొన్ని క్షణాల్లో రిలీఫ్ అనిపిస్తుంది. దీంతోపాటు ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
*లవంగం నూనెను చిగుళ్లపై రాయడంవల్ల నోటిలోని ఇన్‌ఫ్లమేషన్ రక్త ప్రవాహంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. దీంతో నొప్పి సమస్య తగ్గుతుంది. ఇది నేచురల్ అనస్థీషియాగా పనిచేస్తుంది కాబట్టి చిగుళ్ల సెన్సిటివిటీ లేదా మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
*లవంగం నూనె నోటి శుభ్రలో కీ రోల్ పోషిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా లవంగం నూనెలో యూజినోల్ (Eugenol) అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది గనుక నోటి ఇన్ఫక్షన్ రాకుండా ఉంటుంది.
*నోటిలో చిగుళ్ల వ్యాధులకు కారణం అయ్యే P. gingivalis వంటి బ్యాక్టీరియాలను చంపడంలో లవంగం నూనె సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చిగుళ్ల వాపును తగ్గించడమే కాకుండా సైటోకిన్స్(Cytokines) విడుదలను నియంత్రించడం ద్వారా శరీరంలో వాపు పెరగకుండా నిరోధిస్తుంది.
*లవంగం నూనె చాలా గాఢతను కలిగి ఉంటుంది. నేరుగా వాడితే చిగుళ్లు లేదా నోటి లోపలి పొరలు బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో కలిపి వాడటం సురక్షితం. కొందరికి లవంగం నూనె వల్ల అలెర్జీ రావచ్చు. మొదటిసారి వాడేటప్పుడు కొద్దిగా పరీక్షించుకోవడం మంచిది. అలర్జీ వస్తే గనుక వాడకూడదు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






