- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాల్ట్-ఎయిర్ బ్యాటరీ.. ఉప్పు గుహల్లో ఎనర్జీ స్టోరేజ్!
జర్మనీకి చెందిన నిపుణులు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ‘సాల్ట్-ఎయిర్ బ్యాటరీ’ సాంకేతికతతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్‌తో గాలిని కంప్రెస్ చేసి, భూగర్భంలోని ఉప్పు గుహల్లో ఎనర్జీని నిల్వ చేస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా వరకు విద్యుదుత్పత్తి నీటి వనరులు, తర్వాత సోలార్ ఎర్జీ నుంచి జరుగుతున్నది. అయితే మారుతున్న పరిస్థితుల్లో ఇది మాత్రమే సరిపోదు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రపంచం ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా జర్మనీ ‘సాల్ట్ -ఎయిర్ బ్యాటరీ (AirBattery)’ అనే ఒక ప్రయోగానికి తెరతీసింది. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన టెక్నాలజీతో సాధారణ ఉప్పు, గాలి నుంచి వచ్చే శుభ్రమైన ఎనర్జీని నిల్వ చేస్తున్నది. ప్రపంచంలోనే మొదటి వాణిజ్య స్థాయి ప్రాజెక్ట్‌గా దీనిని అమలు చేస్తున్నది. ఇంతకీ దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి?
టర్బైన్‌లతో విద్యుత్..
సాల్ట్-ఎయిర్ బ్యాటరీ అనేది దశాబ్దాల పాటు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇజ్రాయెల్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని జర్మనీలో వాణిజ్య స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇక దీని పనితీరు విషయానికి వస్తే అధిక ఎనర్జీ ఉన్నప్పుడు (సోలార్ లేదా విండ్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు) విద్యుత్‌తో గాలిని కంప్రెస్ చేసి, భూగర్భంలోని ఉప్పు గుహల్లో(salt caverns)నిల్వ చేస్తుంది. అవసరం వచ్చినప్పుడు ఆ కంప్రెస్డ్ ఎయిర్‌ను విడుదల చేసి టర్బైన్‌ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది హైడ్రాలిక్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ (CAES) టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా అగ్ని ప్రమాదాలకు, పేలుళ్లకు ఆస్కారం ఉండదు కాబట్టి అత్యంత సురక్షితం కూడాను. పూర్తిగా రీసైక్లింగ్ చేయవచ్చు. కాబట్టి సాంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీల కంటే చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు అంటున్నారు నిపుణులు.
ఎనర్జీట్రాన్సిషన్‌కు కీలకం
సాల్ట్-ఎయిర్ బ్యాటరీ గృహాలు, పరిశ్రమలు, రిమోట్ గ్రామాలు, జాతీయ ఎనర్జీ గ్రిడ్‌లను స్థిరీకరించడంలో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సూర్యుడు లేదా గాలి తక్కువగా ఉన్న సమయాల్లో (Dunkelflaute) విద్యుత్ సరఫరాను నిరంతరం కొనసాగించడానికి సహాయపడుతుంది. 2027-2028 నాటికి జర్మనీలో ప్రపంచంలోనే మొదటి వాణిజ్య స్థాయి AirBattery ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని నిపుణుల అంచనా. ఇది పర్యావరణ అనుకూలమైన ఎనర్జీ ట్రాన్సిషన్‌కు కీలకమైన మలుపుగా భావిస్తున్నారు.
దాని ప్రయోజనాలు
*లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన మెటీరియల్స్ అవసరం లేదు. సాధారణ ఉప్పు, గాలి ఉంటే చాలు.
*దశాబ్దాల పాటు (20–30+ సంవత్సరాలు) మన్నిక, పనితీరు తగ్గదు, డీగ్రేడేషన్ చాలా తక్కువ.
*అత్యంత సురక్షితం. అగ్ని ప్రమాదాలకు, పేళ్లలకు అవకాశం లేదు. నాన్-టాక్సిక్ కూడా.
*పూర్తిగా రీసైక్లింగ్ చేయవచ్చు. పర్యావరణఅనుకూలం, తక్కువ వేస్ట్, తక్కువ ఖర్చు, లిథియం-అయాన్ బ్యాటరీల కంటే చాలా చౌకగా తయారు చేయవచ్చు.
*లాంగ్-డ్యూరేషన్ స్టోరేజ్, సోలార్/విండ్ ఎక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసి, తక్కువగా ఉన్న సమయాల్లో (Dunkelflaute) గ్రిడ్‌ను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. గృహాలు, పరిశ్రమలు, రిమోట్ గ్రామాలకు, జాతీయ ఎనర్జీ గ్రిడ్‌లకు అనువుగా ఉంటుంది. జర్మనీలోని 400+ ఉప్పు గుహల ద్వారా భారీ స్టోరేజ్ సామర్థ్యం (330 TWh వరకు) సాధ్యమవుతుంది.






